'బిగ్ బాస్ 3'.. డేట్ ఫైనల్ అయినట్లే..!

Published : Jul 03, 2019, 01:34 PM IST
'బిగ్ బాస్ 3'.. డేట్ ఫైనల్ అయినట్లే..!

సారాంశం

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకొంది. 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకొంది. ఇప్పుడు మూడో సీజన్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫైనల్ గా ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 21నుండి బిగ్ బాస్ హడావిడి మొదలుకానుంది.

ఇప్పటికే నలభైమంది వరకు హౌస్ మేట్స్ ని ఎంపిక చేసి ఉంచారు. వీరిలో 14మందిని ఫైనల్ చేయాల్సివుంది. ఈ వీకెండ్ లో లిస్ట్ ని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి ఈ లిస్ట్ లో కన్ఫర్మ్ గా ఉందని చెబుతున్నారు. 

ప్రతీవారం బిగ్ బాస్ షోకి ఓ సినిమా సెలబ్రిటీని తీసుకురావడం ద్వారా బిగ్ బాస్ 3ని రక్తికట్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో హడావిడి వంద రోజుల పాటు ఉంటుంది. అంటే దాదాపు నవంబర్ ఆఖరు వరకు బిగ్ బాస్ 3 ప్రసారమవుతుంది. 

PREV
click me!

Recommended Stories

చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ
మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..