బిగ్ బాస్ 3: హిమజ ఔట్.. స్టేజ్ మీదే ఏడ్చేసింది!

Published : Sep 22, 2019, 10:21 PM IST
బిగ్ బాస్ 3: హిమజ ఔట్.. స్టేజ్ మీదే ఏడ్చేసింది!

సారాంశం

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 63 ఎపిసోడ్‌లను పూర్తి చేసి ఆదివారం నాటితో 64వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.  

శనివారం నాటి ఎపిసోడ్ లో డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ పెద్ద బాంబు పేల్చాడు బిగ్ బాస్. రాహుల్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ నిజంగా రాహుల్‌ను ఎలిమినేట్‌ చేయలేదు. బిగ్ బాస్ అతడిని సీక్రెట్ రూమ్ లోకి పంపించారు.

కానీ ఈ విషయం ఇంకా హౌస్ మేట్స్ కి తెలియదు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున.. హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి కొన్ని మెడ్లీ పాటలకు డాన్స్ చేయించారు. అనంతరం బిగ్ బాస్ షోకి గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ కాసేపు హౌస్ మేట్స్ తో ముచ్చటించారు.

ఆ తరువాత హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని వరుణ్ తేజ్ తో అనౌన్స్ చేయించారు. అతడు హిమజ పేరు చెప్పడంతో ఆమె హ్యాపీగానే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది.

ఆ తరువాత హౌస్ లో తన జర్నీని వీడియోగా వేసి చూపించగా.. హిమజ చాలా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. హౌస్ లో చాలా విషయాలను నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఒక్కొక్కరికీ ఒక్కో సలహా ఇచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్