నీ ఆలోచనతోనే నిద్ర లేస్తున్నా.. ఎందుకో: సుశాంత్‌ జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి

Published : Jul 04, 2020, 05:27 PM IST
నీ ఆలోచనతోనే నిద్ర లేస్తున్నా.. ఎందుకో: సుశాంత్‌ జ్ఞాపకాల్లో సీనియర్‌ నటి

సారాంశం

సుశాంత్ మరణంతో షాక్ అయిన భూమిక ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. ఈ మధ్యే తేరుకున్న ఈమె `దాదాపు 20 రోజులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నా. ఎందుకో అర్థం కావడం లేదు.. ఓ సినిమా కోసం కలిసి పనిచేసిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నా.

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది. ఇన్నాళ్లు షాక్‌లో ఉన్న తారలు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా సీనియర్‌ నటి భూమికా చావ్లా స్పందించింది. భూమిక ధోని బయోపిక్‌లో సుశాంత్‌కు అక్కా నటించింది. ఆ సినిమాలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఉన్న సీన్స్‌ తక్కువే అయినా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.

సుశాంత్ మరణంతో షాక్ అయిన భూమిక ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. ఈ మధ్యే తేరుకున్న ఈమె `దాదాపు 20 రోజులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నా. ఎందుకో అర్థం కావడం లేదు.. ఓ సినిమా కోసం కలిసి పనిచేసిన వ్యక్తిని మర్చిపోలేకపోతున్నా. అవును.. నేను అంగీకరిస్తా.. ఇక్కడ కొనసాగడం అంత సులభం కాదు. ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులూ ఉంటారు.

మనల్ని గౌరవించే వారూ ఉంటారు. వ్యతిరేకించే వారూ ఉంటారు. మ‌న‌ల్ని వ్య‌తిరేకించే వ్య‌క్తుల్ని మరిచి ముందుకు సాగిన‌పుడే జీవితం ఆనంద‌ంగా వుంటుంది. ఏదేమైనా గుడ్ బై సుశాంత్.. నువ్వెక్కడున్నా నీ కోసం ప్రార్థిస్తున్నా` అంటూ భావోద్వేగంగా స్పందించింది భూమిక.

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌