Bigg Boss 2.0: పాటొచ్చింది నాన్న దూరమయ్యాడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి భోలే షావలి.. ఎమోషనల్‌ జర్నీ

By Aithagoni Raju  |  First Published Oct 8, 2023, 9:46 PM IST

మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ భోలే షావలి బిగ్‌ బాస్‌ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ద్వారా ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆయనతోపాటు నటి అశ్విని కూడా వచ్చి సందడి చేశారు.


బిగ్‌ బాస్‌ 7 సీజన్‌ 2.0 వెర్షన్‌ ప్రారంభమైంది. కొత్త కంటెస్టెంట్లని హౌజ్‌కి పరిచయం చేస్తున్నారు నాగార్జున. కొత్తగా ఆరుగురు రాబోతున్నారట. ఇప్పటికే సీరియల్‌, సినిమాల నటుడు అంబటి అర్జున్‌ వెళ్లారు. ఆ తర్వాత అశ్విని హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. వీరితోపాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌ భోలే షావలి సైతం వైల్డ్ కార్డ్ ద్వారా మూడో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి రావడం విశేషం.

ఈ సందర్భంగా తన జర్నీ తెలిపారు షావలి. అమ్మ అంటే ఇష్టమని, అమ్మ వల్లే ఇవన్నీ అని, అమ్మని మించినది లేదని తెలిపారు. అయితే అమ్మ జోలపాట పాడుతుంటుంది. ఆ పాట అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను సింగర్‌గా మారడానికి ఆ పాటే కారణమని తెలిపారు. అయితే తనకు దగ్గరయ్యింది, అదే సమయంలో నాన్న దూరమయ్యాడని తెలిపారు. నాన్న ఫోటో ఎప్పుడు కదలదంటారు, కానీ ఆ ఫోటోపై కదిలే పాట తాను అని చెప్పడం విశేషం. 

Latest Videos

భోలే షావలి జర్నీ ఆద్యంతం ఎమోషనల్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. సినిమాల్లో ఆయన పలు సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. అనేక పాటలు పాడారు. జానపద పాటలు బాగా ఆదరణ పొందాయి. ఇటీవల రీల్స్ లో సందడి చేస్తున్న `పాలమ్మిన పట్టుచీర కొన్న` పాటని ఆయనే పాడటం విశేషం. అయితే ఇటీవల డల్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ పిలుపుతో తనకు ఊపొచ్చిందంటున్నారు.ఈ సందర్భంగా నాగార్జునపై పాట పాడి అలరించారు. 

ఇక హౌజ్‌లో దమ్మున్న కంటెస్టెంట్‌, దుమ్ములేపే కంటెస్టెంట్ల గురించి చెప్పాడు. శివాజీ దమ్మున్న కంటెస్టెంట్‌ అని, ఆయన నిజాయితీగా ఉంటారని, అలాగే పల్లవి ప్రశాంత్‌ దమ్మున్న వ్యక్తి అని, ఆట బాగా ఆడుతున్నాడని, రైతు బిడ్డ అని నిరూపించుకుంటున్నట్టు తెలిపారు. 

ఇక అంతకు ముందు నటి అశ్విని వచ్చారు. చదువుని పక్కన పెట్టి మరీ నటి అయ్యిందట. వరంగల్‌ ఎన్‌ఐటీలో స్టడీ చేసి, ఆ తర్వాత నటిగా మారినట్టు తెలిపింది. అంతేకాదు తాను కిక్‌ బాక్సర్‌ అని కూడా తెలిపింది. దమ్ము, దమ్ముగా ఆట ఆడతానని తెలిపింది. ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న వారి గురించి చెబుతూ, శివాజీ, ప్రశాంత్‌ దమ్ముగా ఆట ఆడుతున్నారని, ప్రియాంక శోభా శెట్టి దుమ్ముగా ఆడుతున్నారని తెలిపింది. శోభా శెట్టి హౌజ్‌లో కూడా ఇంకా సీరియల్‌ ఆటే ఆడుతుందని తెలిపింది. 
 

click me!