
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana) నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా అవుతోంది. ఫస్ట్ వీకెండ్ ను కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తూ సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ లో మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నారు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల నుండి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తోనే అదరగొట్టింది. తాజాగా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ అంతకు మించి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే వరకు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియా వైజ్ చూస్తే… నైజాంలో రూ. 25.88కోట్లు, సీడెడ్లో రూ. 7.02 కోట్లు, తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం రూ. 53.07 కోట్లు వసూళ్లు చేసింది. కర్ణాటకతో పాటు మిగిలిన ప్రాంతాల్లో రూ.6.10కోట్లు, ఓవర్ సీస్ లో రూ.10.02 కోట్టు సాధించింది.
తాజాగా సెకండ్ వీక్ పూర్తి చేసుకునే వరకు నైజాంలో రూ.30.80 కోట్లకు చేరుకుంది. సీడెడ్ లో రూ.10.65 కోట్లు, ఏపీ - తెలంగాణ మొత్తంగా రూ.69.98 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తంగా పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 101.7 కోట్లకు పైగా షేర్స్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రూ.200 కోట్ల వరకు సాధించినట్టు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఈ వారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) మూవీ రిలీజ్ కానుండటంతో మున్ముందు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ‘భీమ్లా నాయక్’ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.