భాగమతి డైరెక్టర్.. హన్సికతో మరో ప్రయోగం?

Published : Oct 11, 2019, 07:58 AM ISTUpdated : Oct 11, 2019, 08:08 AM IST
భాగమతి డైరెక్టర్.. హన్సికతో మరో ప్రయోగం?

సారాంశం

పిల్ల జమిందార్ సినిమా నానికి ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అందులో  ఉన్న నటీనటులందరికి కెరీర్ పరంగా ఆ సినిమా చాలా ఉపయోగపడింది. ఇక ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశోక్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది

2011లో వచ్చిన పిల్ల జమిందార్ సినిమా నానికి ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు అందులో  ఉన్న నటీనటులందరికి కెరీర్ పరంగా ఆ సినిమా చాలా ఉపయోగపడింది. ఇక ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశోక్ కి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా అనంతరం బిగ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా అశోక్ తొందరపడకుండా తనకు నచ్చిన కంటెంట్ తో ముందుకు వెళ్ళాడు. 

భాగమతి లాంటి డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్ తో హిట్టు అందుకున్నాడు. చిన్న సినిమాల్లో అత్యంత లాభాలు ఇచ్చిన చిత్రంగా భాగమతి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అనంతరం అశోక్ మరో స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నాడు అనే రూమర్స్ వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా మరో లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ తో అశోక్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హన్సిక పాత్రలో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయట. గ్లామర్ ని ప్రజెంట్ చేయడంతో పాటు తనలోని సరికొత్త నటిని ఆవిష్కరించే విధంగా వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక వివరణ ఇచ్చింది. మరి భాగమతి అనంతరం అశోక్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా