'రాక్షసుడు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా ఎదురీదుతూనే!

By tirumala ANFirst Published Aug 9, 2019, 2:34 PM IST
Highlights

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. 

అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఎదురీదాల్సి వస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాల ప్రభావం వల్ల తొలి రోజు రాక్షసుడు చిత్రానికి యావరేజ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. పాజిటివ్ టాక్ తో శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగాయి. కానీ సోమవారం నుంచి డ్రాప్ మొదలైంది. తొలి వారం ముగిసే సరికి రాక్షసుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8.7 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లో బయ్యర్లు గట్టెక్కేలా కనిపిస్తున్నారు. 

సెకండ్ వీకెండ్ లో వసూళ్ళలో గ్రోత్ కనిపిస్తే మరికొన్ని ఏరియాల్లో కూడా బయ్యర్లు స్వల్ప నష్టాలతో గట్టెక్కే అవకాశం ఉంది. కానీ శుక్రవారం రోజు మన్మథుడు 2, కథనం చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రాక్షసుడు చిత్రం ఈ పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి. 

ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం 8.7 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 8 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాలి. నైజాం ఏరియాలో 3.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.12  కోట్లు, ఈస్ట్ గోదావరిలో 58 లక్షలు, కృష్ణ లో 61 లక్షల షేర్ రాబట్టింది. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కా కమర్షియల్ హిట్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందేనేమో. 

click me!