రాక్షసుడు ఎఫెక్ట్.. బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ?

Published : Aug 06, 2019, 10:32 AM IST
రాక్షసుడు ఎఫెక్ట్.. బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ?

సారాంశం

తండ్రి బెల్లంకొండ సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు అలా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగానే ఎవరు ఊహించని విధంగా స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు.  బాలీవుడ్ లో కూడా బెల్లకొండ వారసుడు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రాక్షసుడు సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్న బెల్లంకొండ హీరో అటు కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. దీంతో తండ్రి బెల్లంకొండ సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు అలా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగానే ఎవరు ఊహించని విధంగా స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. 

బాలీవుడ్ లో కూడా బెల్లకొండ వారసుడు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రెస్ మీట్ లో బెల్లకొండ సురేష్ తన కొడుకు త్వరలో హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పాడు. అయితే ఎవరితో వర్క్ చేస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ హై బడ్జెట్ లో కొడుకు సినిమాను నిర్మించేందుకు సురేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక బెల్లకొండ శ్రీనివాస్ నెక్స్ట్ స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను అనిల్ సుంకర - అభిషేక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్