బాలయ్య రిజక్ట్ చేస్తే.. వెంకీ ఓకే చేశాడు!

Published : Dec 29, 2018, 02:57 PM IST
బాలయ్య రిజక్ట్ చేస్తే.. వెంకీ ఓకే చేశాడు!

సారాంశం

దర్శకుడు వి వి వినాయక్ క్రేజ్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. తన కథలతో హీరోలను కన్విన్స్ చేయలేకపోతున్నాడు. 'అఖిల్' పెద్ద ఫ్లాప్ అందుకున్న వినాయక్, చిరుతో 'ఖైదీ నెంబర్ 150' చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం చిరంజీవికి వెళ్లిపోయింది. ఆ తరువాత 'ఇంటెలిజెంట్' అనే మరో ఫ్లాప్ సినిమా తీశాడు వినాయక్. దీంతో హీరోలు అతడిని నమ్మడం మానేశారు. బాలయ్యతో వినాయక్ సినిమా తీస్తాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

తన తదుపరి సినిమా బోయపాటితో చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇప్పుడు వినాయక్ కథని ఓకే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు వెంకటేష్.  గతంలో వెంకటేష్ తో కలిసి 'లక్ష్మి' సినిమాను రూపొందించాడు వినాయక్. 2006 లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది.

మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాక్. మరి ఈసారి వెంకీకి వినాయక్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి!
 
PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?