ఏమి తేజస్సు...అర్జునిడిగా బాలయ్య అద్భుతం

By team teluguFirst Published Oct 20, 2020, 1:38 PM IST
Highlights


16క్రితం ఆగిపోయిన నర్తనశాల చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల కొన్ని సన్నివేశాలు బాలయ్య దసరా సంధర్భంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 24 నుండి ఎన్ బి కే థియేటర్ శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈ సన్నివేశాలు విడుదల కానున్నాయి. ఈ సంధర్భంగా నర్తనశాల మూవీ నుండి అర్జునుడిగా బాలయ్య లుక్ విడుదల చేయడం జరిగింది. a

ప్రతి విషయంలో తండ్రి ఎన్టీఆర్ ని అనుసరించే నట సింహం బాలయ్య పౌరాణిక పాత్రలు అంటే అమితాసక్తి చూపిస్తారు. ఎన్టీఆర్ చిత్రాలలో నర్తనశాల మూవీ బాలయ్య ఫేవరేట్ మూవీగా ఉంది. అందుకే బాలయ్య ఎన్నో ఆశలతో నర్తనశాల మూవీని ప్రారంభించాడు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో 2003లో అట్టహాసంగా ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న బాలయ్య కొంత వరకు షూటింగ్ కూడా పూర్తి చేశారు. బాలయ్య అర్జునుడిగా నటించగా శరత్ బాబు ధర్మ రాజు, శ్రీహరి భీముడుగా నటించడం జరిగింది. 

ఐతే 2004లో సంభవించిన విమాన ప్రమాదంలో కీలకమైన ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య మరణించారు. దానితో బాలయ్య ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపి వేశారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల కొన్ని సన్నివేశాలు బాలయ్య దసరా సంధర్భంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 24 నుండి ఎన్ బి కే థియేటర్ శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈ సన్నివేశాలు విడుదల కానున్నాయి. 

ఈ సంధర్భంగా నర్తనశాల మూవీ నుండి అర్జునుడిగా బాలయ్య లుక్ విడుదల చేయడం జరిగింది. అర్జునుడు గెటప్ లో బాలయ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అప్పటికి బాలయ్య వయసు పరంగా కూడా తక్కువ కావడంతో ఆయన లుక్ కట్టిపడేస్తుంది. బాలయ్య కలల ప్రాజెక్ట్ పూర్తి కానప్పటికీ...కొన్ని సన్నివేశాలలో అయినా బాలయ్య అర్జునుడిగా కనిపిస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాడు. బాలయ్య ఫ్యాన్స్ సైతం నర్తనశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ఈచిత్రం విడుదల కానుంది. 
 

click me!