‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్ విషయంలో నందమూరి అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈరోజు విడుదలవ్వాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అందుకు కారణమేంటో కూడా చెప్పారు.
నందమూరి నటసింహం, బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా ‘భైరవద్వీపం’ (Bhairava Dweepam). ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ జానపద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1993 లో విడుదలైన ఈ మూవీ అప్పటి ఆడియెన్స్ కే కాకుండా ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. అయితే ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవర్ గ్రీన్ ఫిల్మ్ ‘భైరవ ద్వీపం’ రీరిలీజ్ కు రెడీ అయ్యింది.
అయితే, ఇప్పటికే ఈ చిత్రం రీరిలీజ్ కావాల్సి వచ్చింది. పలు కారణాలతో వాయిదా వేస్తూనే ఉన్నారు. ఆగస్టు 5న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం పలు కారణంలో ఆగస్టు 30కి వాయిదా పడింది. దీంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. మరోసారి రీరిలీజ్ ను వాయిదా వేశారు. ఈసారి వచ్చిన సమస్యను కూడా తెలియజేశారు.మరో తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
undefined
‘భైరవ ద్వీపం’ చిత్రం 4కే వెర్షన్ ను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్రంలోని కొన్ని సన్నివేశాలు 4కే వెర్షన్ లోకి మారడం లేదంట. బెస్ట్ అవుట్ పుట్ ను అందించేందుకు మరింత సమయం అవసరం పడుతుందని, అందుకే వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. నెక్ట్స్ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరీ. ఇక రీసెంట్ గా దీనికి సంబంధించి 4K ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ తర్వాత సినిమాను థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి వాయిదా పడి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది.
క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి చంద్ర శేఖర్ కుమారస్వామి మరియు పి దేవ్ వర్మ ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌ని బెస్ట్ 4K క్వాలిటీ తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణతో, విజయకుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలయ్య ప్రస్తుతం యాక్షన్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్, శ్రీలీలా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.