
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్‌లో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari ) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. కామెడీ చిత్రాలు తీసే అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఈసారి తన రూట్ మార్చి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. పెండ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెకండాఫ్ లో అదిరిపోయే బాలయ్య స్పీచ్ ఉంటుందని తెలుస్తోంది.
ఆ స్పీచ్ అమ్మాయిల తల్లి,తండ్రులకు ఓ క్లాస్ లాంటిదని అంటున్నారు. ఎలా ఆడపిల్లలను పెంచాలి,వాళ్లు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏమి ఏమి ఆలోచిస్తారు,అన్ని వయస్సులోనూ మగాళ్ల నుంచి ఏ విధమైన హెరాస్మెంట్ కు గురి అవుతూంటారు వంటి విషయాలను చెప్తూ ఆ డైలాగు సాగుతుందిట. ఆడపిల్లల జీవితంలో ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలను డైలాగులా సాగే ఆ స్పీచ్ లో ఉంటుందని,ఖచ్చితంగా అదిరిపోయే రెస్పాన్స్ థియేటర్స్ లో వస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.
బాలయ్య మాట్లాడుతూ...‘నవరాత్రులు జరుపుకుంటున్న శుభతరుణంలో నా 108వ చిత్రం ‘భగవంత్ కేసరి’ విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీశక్తికి సంబంధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఇందులో అమ్మాయిని పులిలా పెంచాలనే మాట రాశారు దర్శకుడు అనిల్‌రావిపూడి. ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నా నమ్మకం’ అన్నారు నందమూరి బాలకృష్ణ.
అలాగే ‘అనిల్ అద్భుతమైన కథతో నా దగ్గరకొచ్చాడు. ఈ కథపై ఇద్దరం ఎంతో హోమ్‌వర్క్ చేశాం. కోరుకున్నది రాబట్టుకోవడంలో అనిల్ దిట్ట. అందుకే అన్ని విభాగాల్లో సినిమా అద్భుతంగా వచ్చింది. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమా ప్రారంభం మాత్రమే కూల్‌గా ఉంటుంది. ఓ విస్పోటనం జరిగితేగానీ అద్భుతాలు జరగవు. అలాంటి అద్భుతమే ‘భగవంత్‌కేసరి’. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండలా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘భగవంత్‌కేసరి” అని నమ్మకం వ్యక్తం చేశారు బాలకృష్ణ. ‘నవ్వించేవాడిలో భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయంటారు. మొన్నటివరకూ నవ్వించాను. ఈ సినిమా ద్వారా ఉద్వేగానికి లోనుచేస్తాను అని అనిల్ రావిపూడి అన్నారు.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ (Balakrishna)ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా మిలియన్ వ్యూవ్స్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. బాలకృష్ణ మార్క్ యాక్షన్ అంశాలతో పాటు అనిల్ శైలి వినోదాలతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.