టీజర్ ప్లానింగ్ లో బాలకృష్ణ న్యూ టీమ్

Published : Aug 29, 2019, 02:24 PM IST
టీజర్ ప్లానింగ్ లో బాలకృష్ణ న్యూ టీమ్

సారాంశం

  కథానాయకుడు - మహానాయకుడు డిజాస్టర్స్ అనంతరం నందమూరి బాలకృష్ణ ఎంతో అలోచించి కెఎస్.రవికుమార్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. జై సింహా సినిమాతో బాలకృష్ణకు సక్సెస్ ఇచ్చినప్పటికీ బాలయ్య వెంటనే ఒప్పుకోలేదు. 

కథానాయకుడు - మహానాయకుడు డిజాస్టర్స్ అనంతరం నందమూరి బాలకృష్ణ ఎంతో అలోచించి కెఎస్.రవికుమార్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. జై సింహా సినిమాతో బాలకృష్ణకు సక్సెస్ ఇచ్చినప్పటికీ బాలయ్య వెంటనే ఒప్పుకోలేదు. పాత్ర డిజైనింగ్ నుంచి కథ ఎండింగ్ వరకు ప్రతి విషయంలో సక్సెస్ ఫార్ములా ఉందా లేదా అని అలోచించి రవికుమార్ సినిమాను మొదలుపెట్టాడు. 

ఇక ఆ సినిమా షూటింగ్ మొన్నటి వరకు కాస్త స్లోగా కొనసాగినప్పటికీ ఇప్పుడు స్పీడందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సరికొత్త లుక్ తో అభిమానులకు మంచి కిక్కిచ్చిన బాలయ్య షెడ్యూల్ లో భాగంగా థాయిల్యాండ్ వెళ్లాడు. అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే బాలకృష్ణ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయించినట్లు సమాచారం. ఇక సినిమా టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని బాలకృష్ణ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

న్యూ లుక్ కి సంబందించిన చిన్న టీజర్ ని అయినా విడుదల చేస్తే బావుంటుందని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే టైటిల్ ని కూడా విడుదల చేయాలనీ దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించి మరికొన్ని వారాల్లో స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.  

PREV
click me!

Recommended Stories

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
తల్లి కాబోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్