ఉన్న ఆ ఒక్క స్పెషాలిటీ కోల్పోయిన బాలయ్య..!

Published : Oct 28, 2022, 02:11 PM IST
ఉన్న ఆ ఒక్క స్పెషాలిటీ కోల్పోయిన బాలయ్య..!

సారాంశం

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాపార ప్రకటనల్లో నటించకూడదని పెట్టుకున్న నియమాన్ని బ్రేక్ చేశారు. కెరీర్లో ఫస్ట్ టైం ఒక వ్యాపార ప్రకటనలో ఆయన నటించడం జరిగింది.

స్టార్ హీరో బాలయ్య ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డై హార్ట్ ఫ్యాన్స్ ఆయన సొంతం. దశాబ్దాలుగా బాలకృష్ణ టాప్ స్టార్స్ లీగ్ లో కొనసాగుతున్నారు. ఆయనకున్న స్టార్డం ఫేమ్ రీత్యా అనేక వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం వెంటబడ్డాయి. అయితే బాలయ్య ఆ ఆఫర్స్ ని వ్యతిరేకించాడు. బ్రాండ్ అంబాసిడర్ గా ఎలాంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించనని చెప్పాడు. 

ఏళ్లుగా పాటిస్తున్న ఈ నియమాన్ని బాలకృష్ణ బ్రేక్ చేశారు. ఒక ప్రాపర్టీ డెవలప్మెంట్ సంస్థ ప్రచార కర్తగా మారారు. దీనికి సంబంధించిన యాడ్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ అంబాసడర్ గా బాలయ్య బాధ్యతలు తీసుకున్నారు. యాడ్స్ చేయనని పట్టుబట్టుకు కూర్చున్న బాలకృష్ణ ఒట్టు గట్టు మీద పెట్టి యాడ్ లో నటించటానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. బహుశా సదరు సంస్థ అత్యంత సన్నిహితులది కావచ్చు, లేదంటే ఆయన కూడా భాగస్వామి కావచ్చనే వాదన మొదలైంది. 

ఆ విషయం అలా ఉంచితే బాలయ్య ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్ సిద్ధం చేశారు. వీరసింహారెడ్డిగా బరిలో దిగనున్నారు. గోపిచంద్ మలినేని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. విడుదలైన వీరసింహారెడ్డి ప్రోమోలు దుమ్మరేపాయి. మూవీపై అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరొయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి