ఇది 'బాబు' బయోపిక్ (ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు రివ్యూ)

First Published Feb 22, 2019, 9:47 AM IST

-----సూర్యప్రకాష్ జోశ్యుల

ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ...`ఎన్టీఆర్ -కథానాయకుడు` వచ్చింది..వెళ్లింది...చూసినోడికి, తీసినోడికి ఎవరికీ ఏం ఫలితం లేదు. ఎన్టీఆర్ సిని జీవితంలో పెద్దగా ఎత్తు,పల్లాలు, విలన్స్ ఎవరూ లేరు కాబట్టి సినిమా  ఇంట్రస్టింగ్ గా తీయలేకపోయారు.

(-----Review by సూర్యప్రకాష్ జోశ్యుల) ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ...'ఎన్టీఆర్ -కథానాయకుడు' వచ్చింది.. వెళ్లింది...చూసినోడికి, తీసినోడికి ఎవరికీ ఏం ఫలితం లేదు. ఎన్టీఆర్ సిని జీవితంలో పెద్దగా ఎత్తు,పల్లాలు, విలన్స్ ఎవరూ లేరు కాబట్టి సినిమా ఇంట్రస్టింగ్ గా తీయలేకపోయారు..కాబట్టి జనాలకు ఎక్కలేదని సర్ది చెప్పుకుని సరిపెట్టుకున్నారు. అంతేకాకుండా 'ఎన్టీఆర్ మహానాయకుడు' లో పెద్దాయన రాజకీయ జీవితం చూపెతామని ఆశపెట్టారు. ఆయన రాజకీయ జీవితంలో చాలా మలుపులు, కలుపు(మొక్కలు)లు ఉన్నాయి. ఎంత పెద్ద సక్సెస్ ఉందో...అంతకు మించిన ఫెయిల్యూర్ ఉంది. వెన్నుపోట్లు ఉన్నాయి.ప్రజలకు మేలు చేసిన పనులు ఉన్నాయి. వీటిన్నటిని సమన్యయం చేసుకుంటూ ఇంట్రస్టింగ్ గా సినిమా తీయగలిగారా లేదా చూద్దాం!
undefined
క‌థ: వాస్తవానికి కథగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. రాజకీయంగా అవగాహన ఉన్న అందరికీ తెలిసి ఉన్న వరస సంఘటనల సమాహారం ఇది. టైటిల్స్ వస్తూండగా...ఎన్టీఆర్ జీవితాన్ని గుర్తు చేస్తూ పుట్టిన నాటి నుంచి, సినిమాల్లో స్టార్ డమ్ రావటం దాకా , తర్వాత రాజకీయ ప్రకటన దాకా చూపిస్తారు.(ఇక్కడ బాలయ్య మనవడు నారా దేవాన్ష్ స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తారు) . ‘తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా’ అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌నతో ముగిసిన ‘క‌థానాయ‌కుడు’కు కంటిన్యూషన్ మొదలవుతుంది. తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందించిన నందమూరి తారకరామారావు (బాలకృష్ణ) తన రాజకీయ ప్రచారం మొదలెడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పార్టీ ప్రచారం కోసం క్యాంపైన్ ప్రారంభిస్తారు. అఖండ మెజార్టీతో పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన 9 నెల‌లోపే అధికారంలోకి వస్తారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, సంక్షేమ పథకాలు అమలు మొదలెడతారు. కిలో రెండు రూపాయిల బియ్యం, మహిళలకు ఆస్థి హక్కులో సమాన వాటా బాగా ప్రజల్లోకి వెళ్తాయి.
undefined
మరో ప్రక్క తన భార్య అనారోగ్యం ఆయన్ను కలవరపెడుతూంటుంది. ఆ క్రమంలో భాధ్యతగల భర్తగా, తను బలంగా నమ్మినవి చేసుకుంటూ వెళ్ళిపోయే ముఖ్యమంత్రిగా బిజీ అయ్యిపోతారు. అయితే అదే సమయంలో భార్య బసవతారకం (విద్యాబాలన్) కాన్సర్ బారని పడ్డారని, హార్ట్ కు సంభందించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. దాంతో ఆమెను తీసుకుని అమెరికాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించటానికి తీసుకెళ్ళతారు. వెనక్కి తిరిగి వచ్చేసరికి వెన్నుపోటుకు తను గురి అయ్యారని తెలుసుకుంటారు ఎన్టీఆర్. అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ బాగా నమ్మిన, ఆయన పార్టీకే చెందిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రి పదవినుంచి దూరం చేయడం చేస్తారు. తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేయడం వెనక జరిగిన కథేంటి..నాదెండ్ల భాస్కరరావు చేసిన నమ్మక ద్రోహం ఏమిటి..ఆ సమయంలో చంద్రబాబు పాత్ర ఏమిటి...అప్పటి కాంగ్రేస్ నిరంకుశ‌ పాలనకి ఎలా ఎన్టీఆర్ బుద్ది చెప్ప‌గ‌లిగారు వంటి విషయాలు తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది.
undefined
సమగ్రత లేదు: ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి సంబంధించిన సమగ్రచిత్రంగా దీన్ని చెప్పలేం. 1982 మార్చిలో ఆయన పార్టీ పెట్టింది మొదలు, 1984 ఆగస్టు సంక్షోభం, నాదెండ్ల నెలరోజులు సీఎం అవడం, అవిశ్వాసం తీర్మానం, తిరిగి ఎన్టీఆర్ సీఎం అవడం వరకే ఈ సినిమా కథ. నిజానికి ఆయన రాజకీయ జీవితంలో కీలక మార్పులు, మలుపులు ఆ తర్వాత చాలానే ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే.
undefined
చంద్రబాబు బయోపిక్: ఈ సినిమా చంద్రబాబుని హైలెట్ చేయటానికి తీసినట్లుగా అనిపిస్తుంది. తప్ప ఎన్టీఆర్ ని రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా అనిపించదు. ముఖ్యంగా కాంగ్రేస్ పెద్దలతో తేల్చుకుంటానని ఎన్టీఆర్ డిల్లీకు వెళ్లినప్పుడు ఇక్కడ పార్టీని కాపాడుకోవటానికి చంద్రబాబు వేసే ఎత్తులు ఆసక్తికరంగా హీరోయిజం ని తలపిస్తాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా చంద్రబాబు తన మైండ్ గేమ్‌తో కాపాడుకుంటూ వచ్చిన ఆయన నైపుణ్యం శభాష్ అనాలపిస్తుంది. ఢిల్లీలో పోరాడుతున్న ఎన్టీఆర్ కు మద్దతుగా.... చంద్రబాబు వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్లండం.. అక్కడ నుండి బెంగుళూరుకు తరలించడం వంటి నిర్ణయాలతో చంద్రబాబు..పార్టీ కోసం ఎంత వ్యూహాత్మకంగా పనిచేసారు అనిపిస్తుంది.
undefined
ట్రైన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్నప్పుడు..మధ్యలో వచ్చే సమస్యలను,అక్కడ తగిలే విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగటం వంటివి ..చంద్రబాబు వల్లే పార్టీ నిలబడింది..బ్రతికి ఉంది..ఆయన పార్టీ కోసం మంచే చేసారు. అందుకోసం ఏం చేసినా కరెక్టే అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక చంద్రబాబు పాత్రలో రానా...మేనరిజంతో పాటు వాయిస్‌ని ఇమిటేట్ చేసి ఆయన్ను కళ్ల ముందు ఉంచారు. అసలు ఎన్టీఆర్ బయోపిక్ గా కాకుండా...సంక్షోభ సమయంలో చంద్రబాబు ఎలా తన వాయిస్ ని, తన శక్తిని, తన పట్టుని, తన తెలివితేటలను పార్టీకి ఉపయోగించారు, ఎలా నిలబెట్టారు అనే పాయింట్ చుట్టు అల్లి సినిమా తీసి ఉంటే అసలు ఇబ్బందే లేకపోయేది. ఎన్టీఆర్ బయోపిక్ అనిచెప్తూ...కావాలని చంద్రబాబుని హైలెట్ చేయటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది పెద్దాయన అభిమానులకు. రామక్రిష్ణ స్టూడియోలో ఎమ్మెల్యేల క్యాంపు, ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమైన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ కాకుండా బెంగలూరుకు తరలించడం వంటివి చూస్తూంటే.. అప్పటినుంచే చంద్రబాబు క్యాంపు రాజకీయాలు చేయడంలో ఎక్స్ పర్ట్ అని చూపించనట్లు అనిపిస్తుంది.
undefined
సంపూర్ణత సిద్దించలేదు: ఓ సినిమాగా ఇది ఫస్టాఫ్ రేసిగా పరుగెడితే..సెకండాఫ్ నత్త నడక నడిచింది. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే..ఫస్ట్ పార్ట్ లోలాగ సీన్స్ రిపీట్ కాలేదు...చెప్తున్న విషయంపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్లిపోయారు. దాంతో చూస్తున్నంతసే తెలిసిన విషయాలే అయినా బోర్ అనిపించలేదు. అలాగని ప్రత్యేకమైన ఇంట్రస్ట్ కలిగించి లీనమూ చెయ్యలేదు. క్లైమాక్స్ లో ముగింపు...తమకు ఎక్కడదాకా కావాలో అక్కడ దాకా చెప్పేసి అర్దాంతరంగా ఆపేసిన ఫీలింగ్ వచ్చింది. యాత్ర సినిమాలాగ కేవలం ఎన్టీఆర్ ..రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు,ఆయన జనాలకు ఏం చేసారు అని చెప్పదలచుకుంటే ఏ సమస్యా లేకపోను. అలా కాకుండా ఆయన పుట్టుకతో మొదలెట్టి..సిని కెరీర్ చూపెట్టి...ఆఖర్లో ఏ జరిగిందో చెప్పలేదు. అది మంచైనా చెడైనా చెప్పలేము అనుకున్నప్పుడు అసలు మొదట నుంచి మొదలెట్టడం ఎందుకు...ఓ ఎపిసోడ్ గా చెప్తే సరిపోయేది. దాంతో రెండు పార్ట్ లు చూసినా సంపూర్ణమైన బయోపిక్ లేదా సినిమా చూసిన ఫీలింగ్ రాలేదు. ఏదో మిస్సైనట్లు అనిపించింది.
undefined
ఫెరఫెక్ట్ సింక్: ఈ సిననిమాకు హైలెట్స్ లో బాలయ్య ఒకరని చెప్పాలి. తన వయస్సుకి తగ్గ పాత్ర కావటంతో ఎక్కడా ఇబ్బందిగా అనిపించలేదు. అలాగే బాలయ్య తన రెగ్యులర్ ఎమోషన్స్ ని, ఎక్సప్రెషన్స్ ని కంట్రోల్ చేసుకుని తన తండ్రిని ఆవాహన చేసుకునే ప్రయత్నం చేసారు. దెబ్బ తిన్న పులిలా ...ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక చూపే ఆగ్రహాన్ని ఎంత బాగా అభినయించారో...తన భార్య కాన్సర్ తో మరణిస్తుందని తెలిసినప్పుడు కలిగిన ఆవేదనను అంతే సమర్దవంతంగా కళ్లలో చూపించారు. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో ప్రాణం పోసి ఆ రోజులను గుర్తు చేసారు.
undefined
క్రిష్ పనితీరు: క్రిష్ క్యారక్టరైజేషన్స్ పట్టుకుని కథనం నడిపించారు. ఏది ఎంత వ‌ర‌కూ చెప్పాలో అంతే చెప్పాడు. ముఖ్యంగా అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌కి చాలా అవరోధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి రావటం, ఆ నిర్ణ‌యం వెనక్కి తీసుకుంటారు..వాటి వెనక ఉన్న అసలు కారణం ఏమిటి వంటి విషయాలు ఇంట్రస్టింగ్ గా చూపెట్టారు. స్వతహాగా ఆవేశపరుడైన ఎన్టీఆర్ ని రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు అసెంబ్లీలో వైరి పక్షం పన్నిన వ్యూహం (పాత బస్తీ అల్లర్లపై చర్చ, మహిళా ఎమ్మెల్యేలు గాజులు పగులగొట్టడం) వంటివి అద్భుతంగా చూపించారు.
undefined
టెక్నికల్ గా: ఫస్ట్ పార్ట్ ఆడలేదు కదా సెకండ్ పార్ట్ చుట్టేస్తారనుకున్నవాళ్లకు ఈ సినిమా షాక్ ఇస్తుంది. ఎన్‌బీకే బ్యానర్‌లో బాలయ్య ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. జ్ఞాన శిఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. బహిరంగ సభలు.. క్రౌడ్ షాట్స్ వంటివి సినిమాకు రిచ్ లుక్ తెచ్చిపెట్టాయి. కెమెరా వర్క్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లూ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ కు ప్రాణంగా నిలిచింది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
undefined
నీరసం తెప్పించిన అంశాలు: సినిమాలో ఎమోషన్ కంటెంట్ గా పెట్టుకున్న భార్య,భర్తల మధ్య వచ్చే సీన్స్ విసుగు తెప్పించాయి. కథతో మనకు ఎక్కడా ఎమోషన్ కనెక్ట్ కాదు. ఎన్టీఆర్ పదవి పోయింది..తిరిగి పదవి పొందాడు, మధ్యలో మనకేంటి అనిపిస్తుంది కానీ...ఆ పాత్రతో మనం తాధ్యాత్మం చెంది లీనం కాము. అలాగే చాలా ప్రొడక్టబుల్ గా నేరేషన్ నడుస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం జాగరత్తగా డిజైన్ చేస్తే బాగుండేది.
undefined
ఇది చంద్రబాబు విజయ గాథ, ఈ తరం మర్చిపోయిన నాదెండ్లను లైమ్ లైట్ లోకి తెచ్చే కథ... Rating: 2.55
undefined
click me!