జుంపాల జుట్టు, కోరమీసాలు, పవర్ ఫుల్ లుక్ లో బాలయ్య, ఏ సినిమా కోసమో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Nov 5, 2023, 12:23 PM IST

పవర్ ఫుల్ లుక్స్ తో.. బాలయ్య బాబు న్యూ లుక్ సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. NBK110 పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్టర్  సంగతేంటి..? నిజంగా బాలయ్య సినిమాకుసబంధించిన పోస్టరేనా.. ఫ్యాన్ మేడా..? 


ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నడు నట సింహం నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. కుర్ర హీరోలు కూడా సాధించలేని విధంగా వరుస హిట్లతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు.  ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. 

అంతే కాదు మంచి మంచి స్టోరీలు సెలక్ట్ చేసుకుంటూ.. యంగ్ డైరెక్టర్స్ చాన్స్ ఇస్తూ.. వాళ్లు చెప్పే  లైనప్స్ తో సరికొత్త బాలయ్య ఆవిష్క్రుతం అవుతున్నాడు. కొత్తవారి వచ్చినా.. వారు చెప్పే కథ నచ్చితే సై అంటున్నాడు స్టార్ సీనియర్ హీరో.  ఇటీవల NBK108 సినిమాగా భగవంత్ కేసరి వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో ముచ్చటగా యూడు సినిమాలు వరుసగా హిట్ కొట్టాడు నటసింహం. 

Latest Videos

 

ఇంతకముందర ఎప్పుడూ చూడని రోల్ లో మన లెజెండరీ NBK 🤔 కోసం ఇక వెయిట్ చేయలేం 🔥 pic.twitter.com/7NzuUmgkVh

— Balayya Yuvasena (@BalayyaUvasena)

ప్రస్తుతం బాలకృష్ణ తన  109 సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈసినిమా ఉండగా. బాలయ్య తన నెక్ట్స్ సినిమాపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం.బాలయ్య నెక్స్ట్ సినిమా NBK110 ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో  మాత్రం బాలయ్య బాబు 110వ సినిమా గురించి న్యూస్ వైరల్ అవుతోంది. అంతే కాదు దీనికి సబంధించిన ఓ  పోస్టర్  కూడా వైరల్ గా మారింది. 

ఈ పోస్టర్ లో బాలకృష్ణ చాలా అంటే చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఒక రాజు గెటప్ లో సీరియస్ లుక్ లో.. ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపించాడు బాలయ్య. పోస్టర్ పై బాలయ్య 110 అని వేసి #BattleofBreaths అనే హ్యాష్ ట్యాగ్ కూడా కనిపిస్తోంది.  అయితే ఇది అఫీషియల్ పోస్టర్ కాకపోవచ్చని.. ఫ్యాన్ మేడ్  పోస్టర్ అయ్యి ఉంటుందని అంటున్నారు. కాగా ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడిని ఇలా ప్రమోట్ చేస్తున్నారు. అఫీషియల్ గా మాత్రం బాలకృష్ణ 110 వ సినిమా ప్రకటించలేదు. 
 

click me!