సంక్రాంతి డేట్‌ ఫిక్స్ చేసుకున్న బాలయ్య.. `వీరసింహారెడ్డి` వచ్చేది ఆ రోజునే

Published : Dec 03, 2022, 03:56 PM IST
సంక్రాంతి డేట్‌ ఫిక్స్ చేసుకున్న బాలయ్య.. `వీరసింహారెడ్డి` వచ్చేది ఆ రోజునే

సారాంశం

`వీరసింహారెడ్డి` సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పొంగల్‌కి చాలా సినిమాలున్నప్పటికీ పండక్కే రావాలని మేకర్స్ నిర్ణయించారు. తాజాగా రిలీజ్‌ డేట్‌ ని ఫైనల్‌ చేశారు. 

నందమూరి నటసింహాం బాలకృష్ణ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ `వీర సింహారెడ్డి`. `అఖండ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా `క్రాక్‌` వంటి హిట్‌ తర్వాత గోపిచంద్‌ మలినేని రూపొందిస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. శృతి హాసన్‌ హీరోయిన్‌గా చేస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం తాజాగా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. 

`వీరసింహారెడ్డి` సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పొంగల్‌కి చాలా సినిమాలున్నప్పటికీ పండక్కే రావాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో చిరంజీవి, విజయ్‌ వంటి హీరోల సినిమాలకు పోటీగా ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. ఆయా హీరోలతో బాలయ్య ఈ సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. దీంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ ని ఫైనల్‌ చేశారు. జనవరి 12న `వీర సింహారెడ్డి` సినిమాని రిలీజ్‌ చేయబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా ఇదే రిలీజ్‌ కానుందని చెప్పొచ్చు. 

కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌ సైతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. బాలయ్య ఇందులో కోపంగా ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇస్తున్నట్టుగా ఉంది. ఈ న్యూస్‌తోపాటు ఈ పోస్టర్‌ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాపై ఫస్ట్ లుక్‌ నుంచి ఆసక్తి  నెలకొంది. ఇందులో బాలయ్య సాల్ట్ అండ్‌ పెప్పర్‌ లుక్‌ మరింత ఆకట్టుకునేలా ఉంది. ఆయన స్టిల్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ లు ఆసక్తిని క్రియేట్‌ చేస్తూ, అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇటీవల విడుదలైన `జై బాలయ్య` సాంగ్‌ కూడా బాగా ఆకట్టుకుంది. థమన్‌ దీనికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈపాటపై పలు విమర్శలు వస్తున్నాయి. పాత సినిమాల పాటలను పోలినట్టు ఉందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే సంక్రాంతికి బాలయ్య `వీర సింహారెడ్డి`తోపాటు చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, విజయ్‌ `వారసుడు`, అఖిల్‌ `ఏజెంట్‌` చిత్రాలు విడుదల కానున్నాయి. థియేటర్ల విషయంలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే బాలయ్య మూవీ, చిరంజీవి చిత్రానికి ఒకే ప్రొడ్యూసర్‌ కావడం విశేషం. వీరికి `వారసుడు` పోటీ ఇవ్వనున్నారు. ఈ విషయంలో వివాదం రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. మరి ఎలా మ్యారేజ్‌ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంది. జనం కూడా ఆదరిస్తారు. కంటెంట్‌ బాగున్న సినిమాకి ఆడియెన్స్ పట్టం కడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి సంక్రాంతి విన్నర్‌ ఎవరనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?