ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకోబోతున్నారో తెలుసా ?

Published : May 05, 2025, 10:33 PM IST
ఏకంగా 10 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య.. నెక్స్ట్ మూవీకి ఎంత తీసుకోబోతున్నారో తెలుసా ?

సారాంశం

ఒక సమయంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన నటసింహా నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.

ఒక సమయంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన నటసింహా నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. అయితే ఎన్నో సంవత్సరాల పాటు బాలయ్య పారితోషికం టాలీవుడ్ టాప్ హీరోలతో పోలిస్తే తక్కువగానే ఉండేది.

ఇంతకుముందు వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాల సమయంలో ఆయన రెమ్యూనరేషన్ ₹15 కోట్లు నుంచి ₹18 కోట్లు మధ్యలో ఉండేది. బాలయ్యతో సినిమా చేసే అవకాశం దొరకడం సులభం కాదు. ఆయనకు తన స్వంత షరతులు ఉంటాయి. అయినా కూడా, ఆయనతో హిట్ కొడితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో, నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాల నేపథ్యంలో బాలయ్య తన  రెమ్యునరేషన్ ను భారీగా పెంచినట్టు సమాచారం. ఇటీవల విడుదలైన 'డాకు మహారాజ్' కూడా మంచి విజయం సాధించింది. దీనితో బాలయ్య తన రెమ్యునరేషన్ ని మరోసారి పెంచారట .

వచ్చే అఖండ 2 సినిమాకి బాలకృష్ణ ₹35 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే తదుపరి చిత్రానికి ₹45 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల చెబుతున్నాయి.

ఈ సినిమా ద‌ర్శ‌కుడు గోపిచంద్‌కు కూడా దాదాపు ₹15 కోట్లు రెమ్యూనరేషన్ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, లొకేషన్లు, గ్రాఫిక్స్, ప్రమోషన్స్ తదితర అంశాలను కలుపుకుంటే ప్రాజెక్ట్ మొత్తం బడ్జెట్ ₹100 కోట్లకు మించి వెళ్లే అవకాశం ఉంది.

ఈ స్థాయిలో సినిమాను లాభాల్లోకి తీసుకురావడం నిర్మాతలకు సవాలుగా మారుతుంది. అయితే బాలయ్య క్రేజ్, మాస్ ఆడియెన్స్‌పై ప్రభావం ఉన్న నేపథ్యంలో, డిస్ట్రిబ్యూషన్, థియేట్రికల్, OTT హక్కుల ద్వారా ఈ ఖర్చును సమర్థవంతంగా సమతుల్యం చేయాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.

ఇప్పటివరకు అధికారికంగా ఏమి ప్రకటించకపోయినా, బాలయ్య పారితోషికం భారీగా పెరిగిందన్నది ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఈ మార్పుతో టాలీవుడ్‌లో మరోసారి స్టార్ పారితోషికాలపై ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక