నర్సులకు ఎప్పుడూ సరైన గౌరవం దక్కదుః బాలకృష్ణ

By Aithagoni RajuFirst Published May 12, 2021, 6:06 PM IST
Highlights

తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందించారు. నర్సులకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆయన అన్నారు. కానీ నర్సుల పాత్ర ఎంత ముఖ్యమైనదో కరోనా సమయంలో తెలిసి వచ్చిందన్నారు. 
 

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు తారలు తమ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. వారి అవిశ్రాంత సేవాలను గురించి మాట్లాడుతూ, వారికి విషెస్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవి, మహేష్‌ వంటి వారి ఇప్పటికే స్పందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందించారు. నర్సులకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆయన అన్నారు. కానీ నర్సుల పాత్ర ఎంత ముఖ్యమైనదో కరోనా సమయంలో తెలిసి వచ్చిందన్నారు. 

తాజాగా ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. `మనం త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవడానికి నర్సుల పాత్ర చాలా కీలకమైనది. మన శ్రేయస్సులో వారి పాత్ర ముఖ్యమైనది. కానీ వారికి ఎప్పుడూ సరైన గౌరవం దక్కదు. ఈ నర్సులు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నారో గతేడాది మనకు గుర్తు చేశారు. వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా, కృతజ్ఞత భావం ద్వారా వారికి సరైన గౌరవం ఇవ్వగలం. గతేడాది వాళ్లు ఎంతో చేశారు. ఇప్పుడు కూడా వారి సేవలను అవిశ్రాంతంగా అందిస్తున్నారు. 

మేం గర్వించదగ్గ బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ నర్సులకు నా శ్రద్ధ, గౌరవం, ప్రేమని తెలియజేయడానికి కొంత సమయం వారితో కేటాయిస్తాను. వారి విషయంలో గర్వంగా ఫీలవుతాను. ఈ సందర్భంగా మా ఆసుపత్రిలోని నర్సులకు, సమాజంలోని నర్సులందరికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా` అని అన్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణ `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, పూర్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ నెల 28న విడుదల కావాల్సిన సినిమాని వాయిదా వేశారు. 

click me!