‘సినీ చరిత్రలో చెరగని ముద్ర’.. అవార్డు సందర్భంగా వహీదా రెహమాన్ కు బాలకృష్ణ శుభాకాంక్షలు

By Asianet News  |  First Published Sep 27, 2023, 2:00 PM IST

దిగ్గజ నటి వహీదా రెహ్మాన్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నందమూరి నటసింహాం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికరమైన నోట్ విడుదల చేశారు.
 


తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసి.. ఉత్తరాదిన విజయబావుటా ఎగురవేసిన ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌ (Waheeda Rahaman)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2023తో ఆమెను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుతో భారతీయ సినిమా రంగంలో వహీదాకు అత్యున్నత గుర్తింపు దక్కింది. అవార్డు వరించడం పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందనలతో ముంచెత్తారు. 

ఈ సందర్భంగా నందమూరి నటసింహం.. బాలకృష్ణ (Balakrishna) ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో.. ‘భారతీయ సినీ చరిత్రలో రెహమాన్ గారి ప్రయాణం ఒక చెరగని ముద్ర. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, అత్యంత సహజంగా అభినయించే దిగ్గజనటి వహీదా రెహ్మాన్ గారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా వారికి ఎంతో అనుభందం ఉంది. నాన్నగారి జయసింహ చిత్రంలో వహీదా గారు అద్భుతమైన పాత్ర పోషించారు. అపారమైన ప్రతిభతో మేటీగా ఎదిగిన వహీదా రెహ్మాన్ గారికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం ఆనందదాయకం. వహీదా రెహహాన్ గారికి నా శుభాకాంక్షలు. - నందమూరి బాలకృష్ణ’ అని పేర్కొన్నారు. 

Latest Videos

భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా వహీదా రెహమాన్ ఎప్పుడో చెరగని ముద్రవేసుకున్నారు. వహీదా రెహ్మాన్ ప్యాసా (1957), CID (1956), గైడ్ (1965), కాగజ్ కే ఫూల్ (1959), ఖామోషి (1969), త్రిశూల్ (1978) వంటి చిత్రాలతో నటిగా ప్రసిద్ధి చెందారు. 1955లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా వచ్చిన ‘రోజులు మారాయి’ తెలుగు సినిమాలో ‘ఏరువాక సాగారో అన్నో చిన్నన్నో’ అనే సాంగ్ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జయంసింహా’, ‘ఆలీబాబా 40 దొంగలు’వంటి చిత్రాల్లో మెరిసింది. 1986లో కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’లో రాజమాతగా కనిపించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘చుక్కల్లో చంద్రుడు’లో కనిపించి అలరించారు.

click me!