
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు. ఏమాత్రం తగ్గడంలేదు. కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ. సక్సెస్ సాధిస్తున్నాడు. ప్రస్తుతం తన 109 సినిమా మెగా డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు బాలయ్య. ఒకదానికి మించి మరొకటి ఆయన సినిమాలు వసూళ్లు సాధించాయి బాలయ్య సినిమాలు రీసెంట్ గా హ్యాట్రిక్ సక్సెస్ తో పండగ చేసుకున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈసినిమాతో మరో హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు బాలకృష్ణ.,
ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం ఈ సినిమా రంపచోడవరం,మారేడుమిల్లి ఫారెస్టు ప్రాంతంలో జరుగుతుంది. డీఫ్ పారెస్ట్ లో ఈ షూటింగు కొనసాగుతోంది. బాలయ్యతో పాటు ప్రధానమైన తారాగణం పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారని అంటున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లు గా ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. అంతే కాదు.. బాలయ్య సరసన త్రిష కూడా నటిస్తుందంటూ టాక్ వనిపించింది. కాని ఇప్పటివరకూ టీమ్ కన్ ఫార్మ్ చేయలేదు. ఇక బాలయ్య ఈసినిమాలో ఓల్డ్ లుక్ లో కనిపనించబోతున్నట్టు తెలుస్తోంది. అటు మరో హీరోయిన్ గా ప్రియమణిని తీసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా కనిపించనుంది.