బలం చూపిస్తున్న బలగం సినిమా.. మరో రెండు అవార్డులు ఖాతాలో వేసుకున్న తెలంగాణ పల్లె సినిమా..

Published : May 09, 2023, 09:07 AM IST
బలం చూపిస్తున్న బలగం సినిమా.. మరో రెండు  అవార్డులు ఖాతాలో వేసుకున్న తెలంగాణ పల్లె సినిమా..

సారాంశం

మరోసారి తన బలం చాటుకుంది బలగం సినిమా.. ఎన్నో కుటుంబాలను కలుపుతున్న ఈ తెలంగాణ భావోద్వేగాల సినిమా.. రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా.. తగ్గేదే లేదంటోంది. మరో రెండు అంతర్జాతీయ అవార్డ్ లను తన ఖాతాలో వేసుకుంది.   

రిలీజ్ అయ్యి 50రోజులువుతున్నా.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయినా.. ఆకరుకు టీవీలో కూడా వచ్చినా.. బగలం సినిమా బలం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ప్రతిష్టాత్మక అవార్డ్ లను తన ఖాతాల వేసుకుంటుందీ మూవీ.. తాజాగా మరో రెండు అవార్డ్ లను సాధించింది. 

తాజాగా స్వీడీష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 లో బలగం సినిమాను రెండు అవార్డ్స్ వరించాయి. అందులో బెస్ట్ యాక్టర్ గా కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా  కేతిరి సుధాకర్ రెడ్డి అవార్డ్స్ ను సాధించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సాధించిన ఈ సినిమా .. ఈరెండు అవార్డ్స్ తో ఇంకా బూస్ట్ వచ్చినట్టు అయ్యింది. అంతే కాదు ఇక ఈ సినిమాని  ఆస్కార్ కి కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పేశారు. 

ఇంతకు ముందు కూడా చాలా అవార్డ్స్ ను ఈ సినిమా గెలుచుకుంది. ఈ సినిమాకి భీమస్ సెసిరోలె సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. 81 దేశాలు నుంచి 780 మంది పోటీ చేయగా భీమస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని కైవసం చేసుకున్నాడు.

బలగం ఖాతాలో ఇప్పటికే ఎన్నో ప్రతి ష్టాత్మక అవార్డ్ లు వచ్చి చేరాయి.. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించిన  బలగం.. ప్రపంచవ్యాప్తంగా  40కి పైగా ఇంటర్నేషనల్  అవార్డులను సాధించింది. వరుస అవార్డ్ లతో  సంచలనం సృష్టించిన బలగం..చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది.  

జబర్దస్త్ ఫేమస్  కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తెరకెక్కించిన ఈసినిమాలో.. కమెడియన్ కమ్ హీరో  ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్  లీడ్ క్యారెక్టర్స్ చేశారు.  బంధువులు, బంధాలు, వాటి విలువలు తెలియజేస్తూ.. తెరకెక్కిన ఈసినిమా... ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

కలెక్షన్స్ పరంగానే అవార్డులు పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తోంది బలగం సినిమా. ఎన్నో అవార్డ్ లు సాధించినదానికంటే.. ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన గౌరవం బలగం సినిమాకు దక్కింది.  విడిపోయిన ఎన్నో కుటుంబాలు బలగం సినిమా చూసి కలిసిన సంఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. దీంతో రానున్న రోజుల్లో ఎన్ని ఇంకెన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి