
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. సర్ ప్రైజింగ్ సక్సెస్ ను అందుకుంది బలగం సినిమా. ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర అన్యూహ్యంగా హిట్ అయిన సినిమాల్లో బలగం కూడా ఉంది. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన సినిమా బలగం. ఈసినిమాతోనే జబర్థస్త్ కమెడియన్ గా ఫేమస్ అయిన వేణు.. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు.. ఎన్నో అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.
మరి చాలా తక్కువ అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ని కదిలించింది దీనితో ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్స్ కి రావడంతో భారీ లాభాలు ఈ చిత్రం అందుకుంది. బలగం ఘనత.. తెలుుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వలేదు. ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ సక్సెస వేవ్ వెళ్ళిపోయింది. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డ్స్ సాధించింది బలగం సినిమా లేటెస్ట్ గా మరో అరుదైన ఫీట్ ని సెట్ చేసింది. జెనరల్ గా ఏవైనా సినిమాలు 100 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకుంటాయి. లేదా 100 సెంటర్స్ లో ఆడుతాయి లేదా 100 కోట్లు వసూళ్లు అందుకుంటాయి కానీ మా బలగం 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది అని వేణు ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేసాడు.
మరి ఇంటర్నేషనల్ వైడ్ గా 100 అవార్డ్స్ అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు వేణు యెల్దండి తెలంగాణ ప్రజల సంసృతినే కాదు.. వారి భావోద్వేగాలు, భావాలను కూడా సింపుల్ గా అర్ధం అయ్యే విధంగా సినిమా రూపంలో చెప్పి.. ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేసి వదిలిపెట్టాడు. వేణు హైలైట్ చేసిన విధానం, తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై ప్రదర్శించించిన విధానం అందరినీ ఆకర్షించింది. తాజాగా ఈమూవీ కి సబంధించిన ఓ ప్రశ్న .. తెలంగాణకు సబంధించిన ఓ పోటీ పరీక్షల్లో రావడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.