హీరోయిన్ వైష్ణవి చైతన్య బేబీ మూవీతో భారీ కొట్టింది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది.
దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. భారీ లాభాలు పంచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య ఎక్కువ పేరు గడించింది. ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం వైష్ణవి పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయని సమాచారం. తాజాగా దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెకు ఆఫర్ ఇచ్చాడట.
రామ్ పోతినేని హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఓ హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇటీవల రామ్ పోతినేని వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు పూలగుచ్ఛం ఇవ్వడమైంది. పూరి జగన్నాధ్ వైష్ణవికి ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో వైష్ణవి ఆల్రెడీ ఓ చిత్రానికి సైన్ చేశారట. అల్లు శిరీష్ ఈ చిత్ర హీరో అంటున్నారు. బేబీ మూవీకి సైన్ చేసేటప్పుడే మరో మూడు చిత్రాలు నీకు ఇప్పిస్తానని సాయి రాజేష్ హామీ ఇచ్చారట. వాటిలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యిందట. మరో రెండు చిత్రాలు సాయి రాజేష్ మిత్రుల బ్యానర్స్ లో ఉండొచ్చట. చూస్తుంటే వైష్ణవి చైతన్య దశ తిరిగినట్లు ఉంది. ఆమె ఓ స్థాయి హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు కొట్టిపారేయలేం.