ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చూసి నా భార్య వదిలేసింది: హీరో కామెంట్స్!

Published : Oct 31, 2018, 04:17 PM ISTUpdated : Oct 31, 2018, 04:24 PM IST
ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చూసి నా భార్య వదిలేసింది: హీరో కామెంట్స్!

సారాంశం

వెండితెరపై హీరోయిన్లతో హీరోలు చేసే రొమాన్స్ ఒక్కోసారి వారి రియల్ లైఫ్ లో సమస్యలను తీసుకొస్తుంటాయి. ఇలాంతో ఓ సమస్యతోనే బాలీవుడ్  హీరో ఆయుష్మాన్ ఖురానా మూడేళ్ల పాటు ఇబ్బంది పడ్డాడట. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'విక్కీ డోనర్' సినిమాలో హీరోగా నటించాడు ఆయుష్మాన్ ఖురానా.

వెండితెరపై హీరోయిన్లతో హీరోలు చేసే రొమాన్స్ ఒక్కోసారి వారి రియల్ లైఫ్ లో సమస్యలను తీసుకొస్తుంటాయి. ఇలాంటి ఓ సమస్యతోనే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మూడేళ్ల పాటు ఇబ్బంది పడ్డాడట.

కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'విక్కీ డోనర్' సినిమాలో హీరోగా నటించాడు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయాన్ని వెల్లడించాడు. ''విక్కీ డోనర్ సినిమాలో యామీ గౌతమ్ నా పక్కన హీరోయిన్ గా నటించింది. ఓ సీన్ లో ఆమెతో లిప్ లాక్ చేయాల్సి వచ్చింది.

ఆ సీన్ తెరపై అధ్బుతంగా కనిపించింది. కానీ నా భార్య మాత్రం ఆ సీన్ చూసి చాలా బాధ పడింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మా వైవాహిక జీవితం సెట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. యామీతో లిప్ లాక్ కారణంగా మూడేళ్ల పాటు ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా భార్యకి ముద్దు సీన్లపై అభ్యంతరం ఏమీ లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఆయుష్మాన్ ఖురానా నటించిన 'బాదాయి హో' , 'అందాదూన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు
పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా