స్వర భాస్కర్ కు కోర్టులో ఊరట: చర్యలకు ఏజీ నిరాకరణ

By Satish ReddyFirst Published Aug 24, 2020, 7:56 AM IST
Highlights

బోల్డ్ హీరోయిన్ స్వర భాస్కర్ కొద్దిరోజుల క్రితం అయోధ్య మందిరం పై సుప్రీమ్ తీర్పును తప్పుబడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమెపై కోర్టు ధిక్కార పిటీషన్ ఫైల్ అయ్యింది. దీనికి అటార్నీ జనరల్ ఆసక్తికరంగా స్పందించారు.

బోల్డ్ హీరోయిన్ స్వర భాస్కర్ కి ఊరట లభించింది. ఆమెపై కోర్ట్ ధిక్కారానికి పాల్పడ్డారని, చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలన్న పిటీషన్ ని అటార్నీ జనరల్ తిరస్కరించారు. ఆమె ఆరోపణలను అటార్నీ జనరల్ వ్యక్తిగత అభిప్రాయాలుగా పరిగణించారు. వాటిని నేరపూరిత వ్యాఖ్యలుగా తీసుకోలేం అన్నారు. దీనితో స్వర భాస్కర్ పై ఫైల్ అయిన పిటీషన్ విచ్ఛిన్నం అయ్యింది. 

వివరాలలోకి వెళితే కొన్నినెలల ముందు ఏళ్లుగా కొనసాగుతున్న బాబ్రీ మసీదు-అయోధ్య రామ మందిరానికి సంబంధించి కీలక తీర్పు వెలువరించడం జరిగింది. ఆ స్థలాన్ని ఇరువర్గాలకు పంచుతూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ తీర్పును హిందువులు అలాగే ముస్లింలు స్వాగతించారు. ఈ తీర్పుపై స్వర భాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సుప్రీమ్ కోర్ట్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

స్వర భాస్కర్ వ్యాఖ్యలను ఛాలెంజ్ చేస్తూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటకకు చెందిన ఉషా శెట్టి అనే లాయర్ అటార్నీ జనరల్ కి పిటీషన్ పెట్టడం జరిగింది. ఉన్నత న్యాయస్థానాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆమెపై కోర్ట్ ధిక్కార చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ ని కోరారు. దాని అటార్నీ జనరల్ అది నేరం కాదన్నట్లు స్పందించారు. 

click me!