నాగ్ అశ్విన్ చెప్పులు మేటర్ రివీల్ చేసిన అశ్వనీదత్

Published : Jul 10, 2024, 12:02 PM IST
 నాగ్ అశ్విన్ చెప్పులు మేటర్ రివీల్ చేసిన అశ్వనీదత్

సారాంశం

జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. తన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 12 రోజున కూడా కల్కి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇలా ఇప్పటివరకు రూ. 900 కోట్లు కొల్లగొట్టింది కల్కి మూవీ. ' రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. అలానే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ప్రతిరోజూ మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. VFX ప్రధానంగా తీసిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎక్స్‌పీరియెన్స్ చేస్తేనే బాగుంటుందని జనం థియేటర్స్ కు వెళ్తున్నారు.ఈ నేపధ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ అంతటా హాట్ టాపిక్ గా మారారు. ఆయన విజన్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన గురించిన విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మామగారు, సినిమా నిర్మాత అయిన అశ్వనీదత్ ..నాగ్ అశ్విన్ గురించి ఓ ఆసక్తికరమైన విశేషాన్ని షేర్ చేసుకున్నారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ... “జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. తన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అతను మా ఇంటికి హడావుడిగా వస్తాడు. స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటపుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే.. వచ్చేటపుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు” అంటూ నాగి గురించి సరదా విషయాలు చెప్పుకొచ్చారు దత్.    
 
ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించిన  నాగ్ అశ్విన్.. బయట చాలా సింపుల్ గా ఉంటారు. అలాగే డ్రస్ సెన్స్ కూడా చాలా సింపులు గా ఉంటుంది. ఆడంబాలు కనపడవు. ఇక ‘కల్కి’ సినిమా తీసినన్ని రోజులు అతను ఒకే స్లిప్పర్స్ పెయిర్ ధరించడం విశేషం. సినిమా రిలీజైనపుడు పాడైపోయిన స్థితిలో ఉన్న స్లిప్పర్స్ ఫొటోలను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్