టాలీవుడ్ పై ఎన్నికల సెగ!

Published : Mar 11, 2019, 03:06 PM IST
టాలీవుడ్ పై ఎన్నికల సెగ!

సారాంశం

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. ఇకపై అందరి దృష్టి పాలిటిక్స్ పైనే.. ఈ ఎఫెక్ట్ టాలీవుడ్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. ఇకపై అందరి దృష్టి పాలిటిక్స్ పైనే.. ఈ ఎఫెక్ట్ టాలీవుడ్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పటికే డిబేట్ లు కూడా మొదలైపోయాయి. 

అయితే సమ్మర్ సీజన్ సినిమాలకు చాలా కీలకమని చెప్పాలి. ప్రతీ ఏడాది వేసవిలో భారీ చిత్రాలు వరుస కడతాయి. ఈ వేసవిలో పెద్ద సినిమాల తాకిడి కాస్త తక్కువే ఉంది. మహేష్ బాబు 'మహర్షి' ఉన్నా.. అది ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత తీరికగా మే 9న వస్తుంది.

కాబట్టి మహేష్ సినిమాపై ఎన్నికల ఎఫెక్ట్ పెద్దగా ఉండదనే చెప్పాలి. ఈలోగా మీడియం బడ్జెట్ సినిమాలు జెర్సీ, మజిలీ, సీత, కాంచన 3 ఇలా కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఓ పక్కన ఎన్నికల హడావిడి, పోలింగ్ కారణంగా సినిమాల వసూళ్లపై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది.

ఇది కాకుండా మధ్యలో ఐపీఎల్ కూడా మొదలవుతుంది. ఇదంతా చూస్తుంటే ఈసారి సమ్మర్ సినిమాలకు భారీ నష్టాలు తప్పేలా లేవు. కానీ నిర్మాతలు మాత్రం సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!