
టాలీవుడ్ లో మాస్ కా దాస్ అని పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen). మాస్ ఆడియన్స్ ఫేవరేట్ గా మారిన యంగ్ స్టార్.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు.
ఎప్పుడూ ఒకే జానర్ లో సినిమాలు చేస్తే.. ఎంత ఫాలోయింగ్ ఉన్న హీరో అయినా.. ఎప్పుడో అప్పుడు దెబ్బతినాల్సి వస్తుంది. ఈ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడోఏమో యంగ్ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) ఇప్పటి వరకూ యూత్, మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ.. సినిమాలు చేస్తున్నాడు. వారి మద్దతును పొందడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే విశ్వక్(Vishwak Sen) అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాను చేశాడు.
మార్చి 4న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. కామ్ గా కూల్ గా..టాలీవుడ్ లో తనకు ఉన్న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్నాడు యంగ్ హీరో. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా, ఓరోరి సిన్నవాడా సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా అంటూ.. సాగే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. హీరోను ఉద్దేశించి హీరోయిన్ పాడే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
విశ్వక్ జోడీగా ఈమూవీల్ రుక్షార్ థిల్లోన్ నటిస్తుంది. ఇక జై క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి... సానపాటి భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా, అనన్య భట్ - గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఇక విద్యాసాగర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని బాపినీడు - సుధీర్ నిర్మిస్తున్నారు.అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో Vishwak Sen. మరి ఈ సినిమా ఎంత వరకూ ఆడియన్స్ ను అలరిస్తుందో చూడాలి.