Rowdy Boys:ఓటిటిలో "రౌడీ బాయ్స్"..ఎప్పటినుంచంటే

Surya Prakash   | Asianet News
Published : Mar 07, 2022, 10:59 AM IST
Rowdy Boys:ఓటిటిలో "రౌడీ బాయ్స్"..ఎప్పటినుంచంటే

సారాంశం

ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడింది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది.  ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు.


దిల్ రాజు,శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీ కు ప‌రిచ‌యం అయిన ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్ గా నటించిన సినిమా ‘రౌడి బాయ్స్’. ‘శ్రీహ‌ర్ష కొనుగంటి  దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు డివైడ్ టాక్ రావటంతో జనం పెద్దగా చూడలేదు. ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో  ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘ZEE 5’. మార్చి 11 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

దిల్ రాజు మాట్లాడుతూ.. రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడచంతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు. కథ, కథనాలు బాగున్నాయని, ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో ఓపెనింగ్స్ నిలకడగా ఉన్నాయి. పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదు. ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగున్నర కోట్ల షేర్ లభించింది.  సంక్రాంతి బరిలో విడుదలై అందరి అభినందనలు అందుకుంటుంది.

 ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడింది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది.  ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు. అతడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను ఎంచుకున్నాం. భవిష్యత్తులో అతడు మంచి కథలు ఎంచుకునేలా చూసే బాధ్యత నాపై ఉంది అన్నారు.

ఇక ZEE 5 లో విడుదలైన "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ", "లూజర్", "లూజర్ 2", హీరో సుమంత్ "మళ్లీ మొదలైంది", అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ల "బంగార్రాజు" వంటివి మా ZEE 5 లో విడుదలై పెద్ద విజయం సాధించాయి.వీటి ద్వారా ప్రేక్షకులకు ZEE 5 ఎంతో దగ్గరైంది. అలాగే  చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ "రౌడి బాయ్స్"  ఔట్ అండ్ ఔట్ కాలేజ్ సినిమా. యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు , హాయిగా మీ కుటుంబ సభ్యులతో & స్నేహితులు అందరితో కలిసి ఈ సినిమా ని మార్చి 11 నుండి ZEE5 లో ఎంజాయ్ చేయండి.
 

 

PREV
click me!

Recommended Stories

Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?