పా. రంజిత్ ‘సార్పట్ట’ రివ్యూ

By Surya Prakash  |  First Published Jul 22, 2021, 10:07 AM IST

 ‘సార్పట్ట’ ట్రైలర్ చూస్తే ఓ రేంజిలో ఉంటుంది. డబ్బైల నాటి ఓ కొత్త ప్రపంచం..మన ముందు ఆవిష్కారం అవుతుంది. ఆర్య లుక్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యిపోతాం.   


రజనీతో చేసిన ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు చూసిన వారికి దర్సకుడు  పా. రంజిత్  పరిచయం అయ్యిపోతాడు. ఆయన కొత్త చిత్రం ‘సార్పట్ట’ అనగానే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి సైతం మొదలవుతుంది. అందులోనూ ‘సార్పట్ట’ ట్రైలర్ చూస్తే ఓ రేంజిలో ఉంటుంది. డబ్బైల నాటి ఓ కొత్త ప్రపంచం..మన ముందు ఆవిష్కారం అవుతుంది. ఆర్య లుక్స్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యిపోతాం. థియోటర్  లో రిలీజ్ అయితే బాగుండేదే అని బాధపడిపోతాం. ఇలా ఎక్సపెక్టేషన్స్ రైజ్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది. కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చుతుందా లేక తమిళానికే పరిమితం అయ్యిపోతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

Latest Videos

undefined

మనదేశంలో బ్రిటీష్ వాళ్లు ఇక్కడ పాతుకుపోయినప్పుడు వాళ్ల సంస్కృతి,సంప్రదాయలు,ఆలోచనలు, ఆటలు ఇక్కడా మొదలయ్యాయి. తమ సరదాలు కోసం ఇక్కడ ఇండియన్స్ కు భాక్సింగ్ నేర్పించారు. అదో జాతీయక్రీడలా, వారసత్వ సంపదలా మన వాళ్లు దాన్ని తమ తర్వాత తరాలవారికి కూడా అందించే ప్రయత్నం నేర్పిస్తారు. ఇక్కడా భాక్సింగ్ నిపుణులు తయారవుతారు. దాంతో కొన్ని కుటుంబాలు బాక్సింగ్ ని తమ వంశపారంపర్య సంపదలా పెంచి పోషిస్తూంటారు. అలాంటి రెండు గ్రూపులు.. ఇడియప్ప, సార్పట్ట లు. ఇవి రెండు ఎప్పుడూ భాక్సింగ్ లో పై చేయి అవ్వటం కోసం పోటీ పడుతుంటాయి. ఆ సమయంలో తమ ప్రాభవం కోల్పోతున్న ‘సార్పట్ట’ బాక్సింగ్ గ్రూప్ చాలా దిగులుగా ఉంటుంది.  

తమ గ్రూప్ పరువు నిలబెట్టే బాక్సర్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ గ్రూప్ ని  నడిపించే మాజీ బాక్సర్ రంగయ్య (పశుపతి) తనను ఛాలెంజ్ చేసిన ప్రత్యర్థి గ్రూప్ బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) మీదికి బాక్సరే అయిన తన కొడుకును కూడా కాదని రాముడు అనే మరో బాక్సర్ను నిలబెడతాడు. కానీ అతను అడ్డం తిరిగి రంగయ్యను అవమానిస్తాడు. దీంతో అసలైన హీరో రంగంలోకి దిగుతాడు. అతనే  సమరన్ (ఆర్య).

ఎవరీ సమరన్ అంటే.. నార్త్ మద్రాస్ లో లోని ఓ హార్బర్‌లో  కూలిగా పనిచేస్తుంటాడు. బాక్సింగ్‌ అంటే పిచ్చితో చిన్నప్పుడే  స్కూల్‌ ఎగ్గొట్టి  పోటీలు చూడటానికి వెళ్లేవాడు. అయితే, సమరన్‌ బాక్సింగ్‌ పోటీలకు వెళ్లడం తల్లి భాగ్యం(అనుపమ కుమార్‌)కు ఇష్టం ఉండదు. ఒకరోజు ఇడియప్ప, సార్పట్ట గ్రూప్ ల మధ్య జరిగిన బాక్సింగ్‌ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో 
రంగయ్యను ఎంతో గౌరవించే సమర (ఆర్య) రాముడిని సవాల్ చేస్తాడు. అతనతో పోటీకి సై అంటాడు.సార్పట్ట తరపున బాక్సింగ్‌ చేసి గెలుస్తానని సమరన్‌ ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక అక్కడ నుంచి కథ మొదలవుతుంది. సమరన్ గెలుస్తాడా...ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్‌ కొక్కెన్‌)ని ఓడించాడా?  సార్పట్ట  పరువును నిలిపాడా?ఈ ఛాలెంజ్ ని ఎదుర్కొనే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎలా ఉంది..

సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలకు స్క్రిప్టు పరంగా ఓ సమస్య వెంటబడి వచ్చేస్తుంది. అదే ఊహకు అందేలా ఆర్క్ ఉండటం. ప్రధాన పాత్రకు ఓ ఆటపై ప్రేమలో పడటం..ఆ తర్వాత ఆ ఆటలో గెలిచేందుకు నానా కష్టాలు,ఇబ్బందులు. చివరకు అత్యంత కష్టంతా విజయం సాధించటం. ఇదో సింపుల్ ఫార్ములా..మీరు హాలీవుడ్ చూసినా,బాలీవుడ్ చూసినా సౌత్ లో వచ్చే స్పోర్ట్స్ డ్రామాలు చూసినా ఇదే తంతు. దాంతో స్పోర్ట్స్ డ్రామాలో కొత్తదనం ఎంత చూపినా ..ఇంతకు ముందు చూసేసిందే అనే ఫీలింగ్ ని ఈ ఫార్ములా తీసుకొచ్చేస్తుంది. ఈ ఫార్మెట్ బ్రేక్ చేయటం కన్నా దానిపైకి దృష్టి వెళ్లకుండా చేసేందుకు దర్శకులు, స్క్రిప్టు రైటర్స్ కృషి చేస్తూంటారు. నేపధ్యం మారుస్తారు. పీరియడ్ డ్రామాలు తీసుకుంటారు. అలాగే సెంటిమెంట్ ని జోడిస్తారు.  ‘సార్పట్ట’ లో కూడా అదే జరిగింది. పీరియడ్ టచ్ ఇవ్వటం కలిసొచ్చింది. పా.రంజిత్ విభిన్నంగా మేకింగ్ చేసారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా చూస్తే మళ్లీ మామూలు కథగానే మార్చేస్తేంది ఫార్ములా. ఆర్య భాక్సింగ్ లో మంచి స్దాయికి వెళ్లాలనుకోవటం..అడ్డంకులు, ఇబ్బందులు. గెలవటం. 

అయితే సెకండాఫ్ లో పా.రంజిత్ తన మార్కు ని చూపించే ప్రయత్నం చేస్తూ తాగుడు దాని వల్ల వచ్చే నష్టాలు అనే డాక్యుమెంటరీ టైప్ పోగ్రాం రన్ చేసారు. అదే సినిమాని లెంగ్తీగా మార్చటానికి తప్ప వేరేగా దేనికి పనికి రాలేదు. ఆ సీన్స్ తీసేస్తే బాగుండేది అనిపిస్తుంది. అందుకే ఫస్టాఫ్ పరుగుతో ముందుకు వెళ్లిన సినిమా ఇంటర్వెల్ వద్ద బ్లాస్ట్ లా పేలుతుంది. ఫస్టాఫే ఇలా ఉందంటే సెకండాఫ్ ఇంకెలా ఉండబోతోందో అని ఆసక్తిని రేపుతుంది. అయితే అక్కడ పా.రంజిత్ దారి తప్పాడనిపిస్తుంది. సెకండాఫ్ లో చూపించిన ఎలిమెంట్స్ ని ఫస్టాఫ్ నుంచి ప్లే చేసి ఉంటే అంత ఇబ్బందిగా అనిపించేది కాదు. అలాగే  స్పోర్ట్స్ డ్రామాలకు అత్యంత కీలకమైన ‘ఎమోషన్’ మిస్సయింది. అంతేకాదు...ఎంత సినిమాటెక్ అనుకున్నా హీరో మాత్రం ఉన్నట్లుండి బాక్సర్ అయిపోవటం కూడా కాస్త ఇబ్బందానే అనిపిస్తుంది.క్లైమాక్స్ సోసోగా ముగించేసారు. ఇంటర్వెల్ స్దాయి ని దాటుతాడేమో అనుకుంటే అందులో సగం కూడా లేదు. 

అలాగని మరీ ఫరాన్ అక్తర్ రీసెంట్ గా వచ్చిన హిందీ చిత్రం తుఫాన్ లా విసిగించదు.నార్త్ మద్రాస్ లైఫ్ స్టైల్ ని పట్టుకుని దాన్ని అద్బుతంగా చూపించాడు.అప్పట్లో బ్రిటీష్ వారి ప్రభావంతో భాక్సింగ్ ఇక్కడ ఎలా డవలప్ అయ్యింది. మనవారి జీవితాల్లోకి భాక్సింగ్ ఎలా చొచ్చుకొచ్చి ప్రబావితం చేసిందనేది స్పష్టంగా చెప్తాడు. ఆ రీసెర్చ్ వర్క్ నచ్చుతుంది.ఇదో సాంస్కృతిక చరిత్రను స్ప్పశిస్తూ సాగుతుంది.డబ్బైల నాటి మద్రాసీయులను మన ముందు ఉంచుతుంది.అప్పటి సామాజిక వాతావరణాన్ని రాజకీయాలను టచ్ చేసే ప్రయత్నం చేస్తుంది.  వెట్రిమారన్ గత చిత్రాలు వడ చెన్నై వాతావరణాన్ని, పా రంజిత్ గతంలో తీసిన మద్రాస్ సినిమాను ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. 
స్పోర్ట్స్ స్క్రిప్టుని రాజకీయాలు,సంస్కృతితో కలిపే ప్రయత్నం చేస్తాడు. ఆ విషయంలో మిగతా స్పోర్ట్ సినిమాలకు దీనికి చాలా ఉందని అర్దమవుతుంది. అలాగే పా రంజిత్ మార్క్ ని కూడా పట్టి చూపుతుంది. 
 
టెక్నికల్ గా..

తొలి నుంచీ పా.రంజిత్ సినిమాలు టెక్నికల్ గా ఓ స్దాయిలో ఉంటూ వస్తున్నాయి. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు..నటీనటుల నుంచి ఎంతలా పిండుతారో..టెక్నీషియన్స్ నుంచి అదే స్దాయిలో అవుట్ పుట్ లాక్కుంటాడు. ఎక్కడా రాజీపడడు. అది చాలా సార్లు సినిమాలో కొట్టచ్చినట్లు కనపడుతుంది.  ముఖ్యంగా సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమా పూర్తైనా మన చెవుల్లో తిరుగుతూనే ఉంటుంది. 70వ దశకానికి సినిమాని తీసుకెళ్లటంలో ఆర్ట్ డైరెక్టర్ సహకారం చాలా ఉంది. మురళి.జి ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ఎట్రాక్షన్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగే సెకండాఫ్ లో చేయించినట్లు లేరనిపిస్తుంది. నటీనటుల్లో  బాక్సర్‌ సమరన్‌ గా ఆర్య అదరగొట్టాడు.  సమరన్‌ భార్య పాత్రలో దుషారా విజయన్‌ , కోచ్‌ రంగయ్య పాత్రలో పశుపతి సినిమాకు కీలకంగా నిలిచారు.

ఫైనల్ థాట్

స్పోర్ట్స్ డ్రామాని ఆ జానర్ లోనే చెప్పాలి. మధ్యలో మన మార్క్  అంటూ వేరే సీన్స్ కలిపేస్తే ఫలితం వేరేగా ఉంటుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5/5

  
ఎవరెవరు..

 నటీనటులు: ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, సంచన నటరాజన్‌, జాన్‌ కొక్కెన్‌, కలైరాసన్‌, సంతోష్ ప్రతాప్‌, జాన్‌ విజయ్‌, షబీర్ తదితరులు;
 సంగీతం: సంతోష్‌ నారాయణ్‌; 
సినిమాటోగ్రఫీ: మురళి.జి; 
ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.; 
స్టంట్స్‌: అన్బరివ్‌; 
ఆర్ట్‌: టి.రామలింగం; 
నిర్మాత: షణ్ముగమ్‌ దక్షణ్‌రాజ్‌; 
రచన, దర్శకత్వం: పా.రంజిత్‌; 
విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

click me!