డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్.. షూటింగ్‌లో విశాల్‌కి తీవ్ర గాయాలు..

Published : Jul 21, 2021, 06:20 PM IST
డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్.. షూటింగ్‌లో విశాల్‌కి తీవ్ర గాయాలు..

సారాంశం

 క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్‌ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా బలంగా ఆయన గొడకి ఢీ కొట్టడంతో కింద పడిపోయారు. 

తమిళ హీరో విశాల్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `నాట్‌ ఏ కామన్‌మేన్‌` చిత్ర షూటింగ్‌లో విశాల్‌కి గాయాలయ్యాయి. ఫైట్‌ సీక్వెన్స్  షూటింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్‌ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా బలంగా ఆయన గొడకి ఢీ కొట్టడంతో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుపూసకు తీవ్రంగా దెబ్బతగిలినట్టు తెలుస్తుంది. 

అయితే డూప్‌లేకుండా విశాల్‌ ఈ ఫైట్‌ సీక్వెన్స్ లో ఫాల్గొనడం కారణంగానే ఈ ఘటన జరిగిందని చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇప్పుడు విశాల్‌ చేసిన ఈ ఫైటింగ్‌ కి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇదేకాదు ఇదే చిత్ర షూటింగ్‌లో గతంలోనూ గాయపడ్డారు విశాల్‌. అప్పుడు కూడా ఫైట్‌ సీన్‌లో ఓ వ్యక్తి వెనకాల నుంచి తలపై బలంగా కొట్టడంతో ఆ సీసా పగిలిపోయింది. కాకపోతే అప్పుడు పెద్దగా గాయాలు కాలేదు. 

`నాట్‌ ఏ కామన్‌ మేన్‌` చిత్రానికి పి.శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విశాల్‌ నటిస్తున్న 31వ చిత్రం కావడం విశేషం. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశాల్‌ పాత్ర కొత్తగా ఉంటుందట. ఆయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..