వైల్డ్ కార్డుతో వచ్చి అందరికంటే ముందుగా ఫైనల్ వీక్ కి చేరిన అర్జున్.. టికెట్ ఫినాలే అస్త్రలో విజయం 

By Asianet NewsFirst Published Dec 1, 2023, 10:57 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నేడు కీలక పరిణామం జరిగింది. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టికెట్ ఫినాలే అస్త్ర సాధించి ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో నేడు కీలక పరిణామం జరిగింది. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టికెట్ ఫినాలే అస్త్ర సాధించి ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే టికెట్ ఫినాలే అస్త్ర సాధించడం కోసం అర్జున్ తో ప్రశాంత్, గౌతమ్ గట్టిగా పోరాడారు. 

ముందుగా నేటి ఎపిసోడ్ త్యాగం తో మొదలయింది. గౌతమ్ కి తక్కువ పాయింట్స్  ఉండడంతో అతడు రేస్ నుంచి తప్పుకున్నాడు. అతడి పాయింట్స్ ని అమర్ దీప్ కి త్యాగం చేశాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లో అర్జున్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత గౌతమ్, ప్రశాంత్ నిలిచారు. టాస్క్ ముగిసిన తర్వాత సరదా సంఘటన జరిగింది. 

Latest Videos

బిగ్ బాస్ అందరికి టీ ఇచ్చి.. హౌస్ ఉన్న ప్రతి ఒక్కరిని వారి లవ్ స్టోరీలు చెప్పమని అడిగాడు. శివాజీ తన భార్యకి తనకి మధ్య జరిగిన ప్రేమ కథ వివరించారు. ఇక శోభా శెట్టి తన ప్రేమ కథ వివరిస్తూ.. లాక్ డౌన్ లో పరిచయం జరిగింది. ఇద్దరం వీడియో కాల్స్ తో మాట్లాడుకునే వాళ్ళం. అతడి పేరు యశ్వంత్ రెడ్డి. అతడినే పెళ్లి చేసుకోబోతున్నా అని శోభా శెట్టి ప్రకటించింది. 

ఆ తర్వాత మరోసారి అర్జున్, అమర్, ప్రశాంత్ మధ్య టాస్క్ జరిగింది. ముగ్గురూ ఒక తాడు మధ్యలో ఉంటారు. బలంగా లాక్కుని వెళ్లి వారి బుట్టలో జెండాలు వేయాలి. అర్జున్ ఎక్కువ బలం ఉపయోగించడంతో అతడి ముందు అమర్, ప్రశాంత్ తేలిపోయారు. ఈ టాస్క్ లో అర్జున్ విజయం సాధించగా.. అమర్ దీప్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ప్రశాంత్ చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. తక్కువ పాయింట్స్ ఉండడంతో టికెట్ ఫినాలే అస్త్ర రేస్ నుంచి ప్రశాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. 

Also Read: Salaar:సలార్ ట్రైలర్ లో ఇవి గమనించారా, కేజీఎఫ్ తో పెట్టిన లింకులు ఇవే.. అతిపెద్ద మ్యాటర్ దాచిపెట్టేశారా ?

టికెట్ ఫినాలే అస్త్ర ఫైనల్ కంటెండర్స్ గా అమర్, అర్జున్ నిలిచారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ టాస్క్ పాముతో చెలగాటం. వీరిద్దరి ముందు రెండు పాము కటౌట్స్ ఉంటాయి. పాము నోట్లోకి అక్కడున్న పరికరం సహాయంతో బాల్స్ వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వారే విజేత. అర్జున్ ఎక్కువ బంతులని పాము నోట్లో వేసి విజయం సాధించాడు. దీనితో బిగ్ బాస్ అతడికి టికెట్ ఫినాలే అస్త్ర ప్రజెంట్ చేశారు. సీజన్ 7లో ఫైనల్ వీక్ కి చేరుకున్న తొలి కంటెస్టెంట్ అర్జున్ అని బిగ్ బాస్ ప్రకటించారు. 

click me!