
60 ఏళ్లకు మూడగుల దూరంలో ఉన్న ఓ హీరో తండ్రి కాబోతున్నాడు. ఈ మధ్యలోనే రెండో పెళ్లి చేసుకుని అంతలోనే తండ్రి కాబోతున్న ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. అన్న సల్మాన్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చిన అర్బాజ్ ఖాన్ హీరోగా నిలబడలేకపోయాడు. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు.
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాని (Malaika Arora) అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే చాలా ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట ఆతరువాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. మలైకా అర్బాజ్ తో విడాకుల తరువాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. మలైకాతో విడాకులు తరువాత అర్బాజ్ ఖాన్ చాలా కాలం ఒంటరిగా ఉంటూ వచ్చాడు. కానీ 2023లో ఎవ్వరూ ఊహించని విధంగా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయిన షురా ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు అర్బాజ్ ఖాన్.
సినిమాల్లో అడపా దడపా పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు అర్భాజ్ ఖాన్. మేకప్ ఆర్టిస్ట్ ను పెళ్లాడటం సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు ఈ జంట ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. విషయం ఏంటంటే.. షురా త్వరలో తల్లి కాబోతుందట. సో ఖాన్ ఫ్యామిలీలోకి మరో మెంబర్ యాడ్ అవ్వనున్నాడు. అయితే ఇప్పుడు అర్బాజ్ ఖాన్ వయసు 57 ఏళ్ళు. ఈ లేటు వయసులో అతని మళ్ళీ తండ్రి కాబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మలైకా అరోరా తో విడాకుల టైమ్ లో చాలా విమర్శలు ఫేస్ చేశాడు అర్బాజ్ ఖాన్. అటు మలైకా పై కూడా విమర్శలు తప్పలేదు. సోషల్ మీడియాలో మలైకాను గట్టిగా ట్రోల్ చేశారు. విడాకుల తరువాత వీరి వారసుడు మలైకాతోనే ఉంటున్నాడు. ఇక అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిన మలైకా.. రీసెంట్ గా అతనికి కూడా బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక అర్బాజ్ ఖాన్ తెలుగులో కూడా ఒక సినిమాలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి) హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ లో విలన్ గా నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆతరువాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ , శివమ్ భజే’ వంటి సినిమాల్లో కూడా విలన్ రోల్స్ చేసి మెప్పించాడు. షురా ఖాన్ విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడానీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.