విశాఖ తీరానికి ఏపీ అసెంబ్లీ

Published : Mar 21, 2018, 09:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
విశాఖ తీరానికి ఏపీ అసెంబ్లీ

సారాంశం

మహేష్ బాబు హీరోగా వస్తోన్న భరత్ అనే నేను ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు విశాఖ తీరంలో ఏపీ అసెంబ్లీ సెట్ వేసేందుకు సన్నాహాలు

 

తెలుగు చిత్ర సీమలో అగ్ర కథానాయకులుగా వెలుగొందుతోన్న మహేష్ బాబు, రామ్ చరణ్ తమ కొత్త సినిమాల వేడుకలను వైవిధ్యంగా నిర్వహించాలని భావించినట్టున్నారు. అందుకే రామ్ చరణ్ ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకకు విశాఖ ఆర్కే బీచ్‌లో పల్లె వాతావరణంతో కూడిన సెట్‌ను డిజైన్ చేశారు. ‘రంగస్థలం’ సినిమాకు అనుగుణంగా డిజైన్ చేసిన ప్రీ రిలీజ్ వేడుక సెట్ అందరినీ ఆకట్టుకుంది. ‘రంగస్థలం’ 1980 నాటి పరిస్థితులతో కూడిన చిత్రం దానికి అద్దం పట్టేలా సెట్ రూపొందించారు.
 

ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నట్లు ఫిల్మ్ నగర్ తాజా సమాచారం. ‘భరత్ అనే నేను’ ఆడియో రిలీజ్ వేడుకను కూడా వైవిధ్యంగా నిర్వహించాలని మహేష్ భావిస్తున్నారట. అందుకే ‘రంగస్థలం’ ప్రీ రిలీడ్ వేడుక జరిగిన విశాఖ ఆర్కే బీచ్‌లోనే అసెంబ్లీ సెట్ వేసి దానిపై ‘భరత్ అనే నేను’ ఆడియో విడుదల వేడుక జరపాలని చూస్తున్నారట. ‘భరత్ అనే నేను’ రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కాబట్టి కచ్చితంగా అసెంబ్లీ సెట్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.


వరస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కాబట్టి ఇప్పటికే దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో జరపాలని అటు మహేష్ బాబు.. ఇటు నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రకరకాల పోస్టర్లతో ‘భరత్’ హల్ చల్ చేస్తున్నాడు. ఉగాదిని పురష్కరించుకుని విడుదలచేసిన పంచెకట్టు పోస్టర్ అభిమానులను కట్టిపడేస్తోంది. మరోవైపు రెండు వారాల క్రితం విడుదలైన టీజర్ ఇప్పటికే కోటి 30 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే, ఆడియో విడుదల వేడుకను ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి