#Anushka అనుష్క- క్రిష్ మూవీ టైటిల్ ఇదే?

Published : Feb 16, 2024, 09:13 AM IST
#Anushka అనుష్క- క్రిష్ మూవీ టైటిల్ ఇదే?

సారాంశం

 ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. 

బాహుబలి తర్వత నుంచి అనుష్క స్పీడు తగ్గించింది. ఏడాదికి ఒక్క సినిమా కూడా కష్టమనిపించేలా చేస్తోంది. ఆచి,తూచి తన చుట్టూ తిరిగే కథలకే ప్రయారిటీ ఇస్తూ సైన్ చేస్తోంది. ఆ క్రమంలో గత ఏడాది మిస్‌‌‌‌‌‌‌‌ శెట్టి మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొలిశెట్టి చిత్రంతో ఆకట్టుకున్న అనుష్క(Anushka), కొన్ని నెలల గ్యాప్ తర్వాత తిరిగి మరో తెలుగు చిత్రంలో ఓకే చేసింది. క్రిష్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా  షూటింగ్‌ ఆల్రెడీ మొదలై పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో అనుష్క- క్రిష్ మూవీ షూటింగ్ జరిగింది అంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథ అని తెలుస్తోంది. 

 ఈ సినిమాకు టైటిల్ ... శీలవతి అని పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని సౌత్ లాంగ్వేజ్ లలోనూ ఈ సినిమా రిలీజ్ కానుందిట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌‌‌‌‌‌‌‌లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, దీనికీ సంగీతం అందిస్తున్నారు. 

ఒడిశాలోని ఒక లేడీ జీవితంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఒడిశాలోనే జరుగుతోంది. కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది. అలాగే తొలి షెడ్యూల్ ని ఒడిశాలో చేయడానికి కూడా కారణం అదే అంటున్నారు. ఈ షెడ్యూల్ లోనే అనుష్కకు సంబంధించిన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారంట. ఈ సినిమా కథ  పదేళ్లకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు  మలయాళంలో ‘కథనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా