అప్పుడు ఇలా తినగలిగాను.. ఇప్పుడలా కూర్చోలేకపోతున్నానంటోన్న అనుష్క

Published : Dec 17, 2020, 10:12 AM ISTUpdated : Dec 17, 2020, 10:18 AM IST
అప్పుడు ఇలా తినగలిగాను.. ఇప్పుడలా కూర్చోలేకపోతున్నానంటోన్న అనుష్క

సారాంశం

తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది. అంతేకాదు ఫన్నీ కామెంట్‌ చేసింది. తాను కాళ్లు మలుచుకుని కూర్చొని తినలేకపోతుందట. గతంలో తాను చైర్‌ మీద కాళ్లు మలుచుకుని కూర్చొని తింటున్న ఫోటోని షేర్‌ చేసింది అనుష్క శర్మ.

అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తుంది. ఇటీవల ఓ ప్రకటలో భాగంగా తన కడుపులో ఉన్న బిడ్డకి పాటలు వినిపిస్తూ, ఇష్టమైన ఫుడ్‌ తింటూ ఆ అనుభూతిని ఆస్వాధిస్తుంది. మరోవైపు భర్త విరాట్‌ కొహ్లీతోపాటు సరదాగా గడుపుతుంది. స్వయంగా విరాట్‌ దగ్గరుండి అనుష్కకి వ్యాయామాలు చేయిస్తున్నాడు. ఈ ఫోటోలను ఇటీవల పంచుకుంది అనుష్క. 

తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది. అంతేకాదు ఫన్నీ కామెంట్‌ చేసింది. తాను కాళ్లు మలుచుకుని కూర్చొని తినలేకపోతుందట. గతంలో తాను చైర్‌ మీద కాళ్లు మలుచుకుని కూర్చొని తింటున్న ఫోటోని షేర్‌ చేసింది. `గతంలో ఇలా కాళ్లు మలుచుకుని తినగలిగాను. కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. కానీ తింటున్నా` అని పేర్కొంది. ప్రెగ్నెన్సీ వల్ల తన ఉదర భాగం పెరిగింది. దీంతో కాళ్లు మలుచుకోలేని పరిస్థితి నెలకొంది. జనరల్‌గానే గర్భంతో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండలేరు. ఇప్పుడు అనుష్క శర్మ అలాంటి ఇబ్బందులే పడుతుంది. 

అనుష్క జనవరిలో తన బిడ్డకి జన్మనివ్వబోతుంది. అనుష్క, విరాటకొహ్లీ కొన్నాళ్లుగా ప్రేమించుకుని 2017లో డిసెంబర్‌ 11న ఇటలీలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ టైమ్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది అనుష్క శర్మ. ఇటీవల తమ మ్యారేజ్‌ జరిగి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క స్పందిస్తూ, `మా పెళ్ళి అయి మూడేళ్లు.. త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం` అని పేర్కొంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..