అనుష్కలా ఉన్న మరో అమ్మాయిని చూశారా..?

Published : Feb 05, 2019, 12:28 PM IST
అనుష్కలా ఉన్న మరో అమ్మాయిని చూశారా..?

సారాంశం

నిజ జీవితంలో ఒకరిని పోలిన మరొకరు కనిపిస్తుండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అటువంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకి ఎదురైంది. 

నిజ జీవితంలో ఒకరిని పోలిన మరొకరు కనిపిస్తుండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అటువంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకి ఎదురైంది. అచ్చం అనుష్క శర్మలానే ఉన్న ఓ అమ్మాయిని కనిపెట్టారు నెటిజన్లు.

ఇంకేముంది.. ఆ అమ్మాయిని అనుష్కతో పోలుస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె అమెరికాకు చెందిన స్టార్ సింగర్ జూలియా మైకేల్. అనుష్క శర్మని,  జూలియా మైకేల్ లు చూడడానికి ఒకేలా ఉన్నారు. దీంతో నెట్టింట్లో వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అమెరికన్ సింగర్ జూలియా మైకేల్ ఇటీవల తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలను ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అనుష్క శర్మని ట్యాగ్ చేస్తూ..  కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వెస్ట్రన్ వెర్షన్ ఆఫ్ అనుష్క శర్మ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అనుష్కని, జూలియాలను పక్కపక్కన పెడితే విరాట్ కూడా కనిపెట్టలేడు అంటూ సరదాగా కామెంట్లు  చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా