'ఫోర్న్' ఇండస్ట్రీ పై స్టార్ డైరక్టర్ పొగడ్తలు, వైరల్ కామెంట్స్

By Surya PrakashFirst Published Mar 22, 2024, 10:52 AM IST
Highlights

‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి డిఫరెంట్ కథ చిత్రాలతో ఈ డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 

వైవిధ్య చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్దానం సంపాదించుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap). అలాగే  అనురాగ్ మాటలు కూడా సూటిగా, వాడిగా, వేడిగా నస లేకుండా ఉంటాయి. చాలాసార్లు అవి వివాదాస్పదమవుతూంటాయి కూడా. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫోర్న్ ఇండస్ట్రీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.  పోర్న్ ఇండ‌స్ట్రీలో టెక్నాల‌జీ అనేది బాగా అభివృద్ధి చెందింద‌ని అన్నారు. ఆ ఇండ‌స్ట్రీలో అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీని వాడ‌తార‌ని అన్నారు.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

అనురాగ్ మాట్లాడుతూ..  "మీరు ఏ డిజిట‌ల్ అడ్వాన్స్‌మెంట్‌ టెక్నాలిజీని అయినా తీసుకోండి. ముందు దానిని పోర్న్ ఇండ‌స్ట్రీలోనే వాడే ఉంటారు. VCR, DVDల‌ను కూడా ముందు పోర్న్ ఇండ‌స్ట్రీలోనే వాడారు. ఆ త‌ర్వాతే అవి సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వ‌చ్చింది. ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కూడా పోర్న్ నుంచే పుట్టుకొచ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెక్నాల‌జీ అంశంలో పోర్న్ ఇండ‌స్ట్రీనే ముందంజ‌లో ఉంద‌ని చెప్పాలి. అంతెందుకు HD స్ట్రీమింగ్, వీఆర్ ఎక్సపీరియన్స్ అనేవి కూడా పోర్న్ నుంచే వ‌చ్చాయి " అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ టాక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

  ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి డిఫరెంట్ కథ చిత్రాలతో ఈ డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అంతేకాకుండా మలయాళం, మరాఠీ, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మించి సౌత్ ఇండియాలోనూ మంచి పాపులారిటీ సాధించాడు. అందుకే ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటేనే ప్రేక్షకుడు కచ్చితంగా కొత్తదనం ఉంటుందని అనుకుంటాడు. అందుకే అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఆయన సినిమాలు మంచి బజ్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. 
 

click me!