అంటే సుందరానికీ రెండు రోజుల కలెక్షన్స్... టార్గెట్ కి చాలా దూరంలో నాని!

Published : Jun 12, 2022, 02:19 PM IST
అంటే సుందరానికీ రెండు రోజుల కలెక్షన్స్... టార్గెట్ కి చాలా దూరంలో నాని!

సారాంశం

నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతుంది. హిట్ టాక్ తెచ్చుకొని కూడా కలెక్షన్స్ రాబట్టలేక పోతుంది. యావరేజ్ ఓపెనింగ్స్ దక్కించుకున్న అంటే సుందరానికీ రెండో రోజు కొంచెం పర్వాలేదు అనిపించింది. అయితే టార్గెట్ మాత్రం ఎక్కడో ఉంది.   

యంగ్ హీరోల్లో నాని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే సుందరానికీ కూడా ఓ ప్రయోగాత్మక చిత్రంగా చెప్పవచ్చు. దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. గ్యాంగ్ లీడర్ మినహాయిస్తే నాని ఈ మధ్య సీరియస్ కంటెంట్ తో కూడిన చిత్రాలు చేశారు. వి, టక్ జగదీష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కాయి. ఆయన గత చిత్రం శ్యామ్ సింగరాయ్ ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో నాని నటించిన చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడిన చిత్రం శ్యామ్ సింగరాయ్. 

అంటే సుందరానికీ కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కింది. అయితే ఈ ప్రయోగం ప్రేక్షకులకు నచ్చింది. ఫస్ట్ షో నుండే అంటే సుందరానికీ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీనితో నాని క్లీన్ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు. కలెక్షన్స్ విషయంలో మాత్రం అంటే సుందరానికీ డల్ అయ్యింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓపెనింగ్స్ రాలేదు. ఫస్ట్ డే బిలో యావరేజ్ వసూళ్లు రాబట్టింది. రెండో రోజు కొంచెం పర్వాలేదు అనిపించింది. అయితే నాని టార్గెట్ చాలా దూరంలో ఉండగా ఈ జోరు సరిపోదు. 

నైజాంలో రెండు రోజులకు గాను అంటే సుందరానికీ చిత్రం రూ. 2.95 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ లో రూ. 0.75 కోట్లు రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో రూ. 0.82 కోట్లు వసూలు చేసింది. రెండు రోజులకు ఏపీ/తెలంగాణాలో కలిపి రూ.7 కోట్ల షేర్ రూ. 11 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 10.4  కోట్ల షేర్ అందుకుంది. అంటే సుందరానికీ మూవీ రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 31 కోట్ల షేర్ రాబట్టాలి. మిరాకిల్ జరిగితే కానీ అంటే సుందరానికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. 

ప్రాంతాల వారీగా రెండు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయి... 
నైజాం రూ. 2.95 కోట్లు
సీడెడ్  రూ .0.75 కోట్లు    
ఉత్తరాంధ్ర రూ. 0.82   కోట్లు ఈస్ట్  రూ. 0.60   కోట్లు  వెస్ట్ రూ. 0.54   కోట్లు గుంటూరు రూ. 0.55   కోట్లు   కృష్ణా  రూ. 0.51  కోట్లు    నెల్లూరు  రూ. 0.32   కోట్లు
ఏపీ  & తెలంగాణ  రూ 7.04 కోట్లు
కర్ణాటక & ROI రూ.0.60  కోట్లు   ఓవర్సీస్  రూ.2.80   కోట్లు వర్డ్ వైడ్ రూ. 10.44 కోట్లు  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?