బన్నీ నువ్వైనా చెప్పచ్చుగా.. ఈ టైటిల్ వద్దని

By Surya PrakashFirst Published Apr 13, 2021, 11:08 AM IST
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 

టైటిల్ చూసే సినిమాపై జనం ఓ అంచనాకు మొదట వస్తారు. కొన్ని టైటిల్స్ సినిమా జానర్ ని చెప్పేస్తూంటాయి. మరికొన్ని టైటిల్స్ ఖచ్చితంగా వెళ్లేలా టెమ్ట్ చేస్తూంటాయి. అయితే మరికొన్ని టైటిల్స్ నవ్విస్తే..వేరేవి నవ్వులు పాలు అవుతూంటాయి. మొన్న చావు కబురు చల్లగా సినిమాపై సోషల్ మీడియాలో సెటైర్స్ పడ్డాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా టైటిల్ అదీ మెగా క్యాంప్ కు సంభందించిన కొత్త హీరో టైటిల్ ..సోషల్ మీడియాలో కామెడీగా మారింది. ఈ టైటిల్ ..కొత్త హీరోకు మొదట సినిమాకు పెట్టకుండా ఉండాల్సిందేమో అంటున్నారు. ఆ టైటిలే ..'బతుకు బస్టాండ్'. 

వివరాల్లోకి వెళితే.. విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బతుకు బస్టాండ్'. ఈ హీరో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కుమారుడు.  నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐఎన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 

 ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.  ఈ ఫస్ట్‌ లుక్‌లో హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరూ రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

click me!