
ఏజెంట్ మూవీ వైజాగ్ సతీష్ భోళా శంకర్ విడుదల ఆపివేయాలని పిటిషన్ వేశారు. ఏజెంట్ మూవీ హక్కుల విషయంలో నిర్మాత అనిల్ సుంకర తనను మోసం చేసిన నేపథ్యంలో తన డబ్బులు తిరుగి చెల్లించే వరకు భోళా శంకర్ విడుదల అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఏజెంట్ ఏపీ, తెలంగాణా, కర్ణాటక హక్కులు నాకు ఇస్తానని రూ. 30 కోట్లు తీసుకున్న అనిల్ సుంకర కేవలం వైజాగ్ హక్కులు ఇచ్చారు. ఈ క్రమంలో భోళా శంకర్ విడుదలకు 15 రోజుల ముందే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అగ్రిమెంట్ కూడా చేశారు. అందుకే కోర్ట్ ని ఆశ్రయించాల్సి వచ్చిందని సతీష్ లాయరు చెప్పారు. కాగా సతీష్ ని కేసు వెనక్కి తీసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారట. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుండి తనకు ప్రాణహాని ఉందని వైజాగ్ సతీష్ హైదరాబాద్ కమిషనర్ కి పిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.
భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకుడిగా ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.