కరాటే కళ్యాణిపై మరో కేసు, ఒక్కొక్కరిగా బయబటకు వస్తున్న బాధితులు

Published : May 15, 2022, 08:51 AM IST
కరాటే కళ్యాణిపై మరో కేసు, ఒక్కొక్కరిగా బయబటకు వస్తున్న బాధితులు

సారాంశం

కరాటే కళ్యాణి బాధితులు ఒక్కొక్కుగా బయటకు వస్తున్నారు. ఆమెపై రీసెంట్ గా మరో కేసు నమోదు అయ్యింది. తనకు కల్యాణి వల్ల ప్రాణహాని ఉంది అంటూ..గతంలో  బెదిరింపులకు పాల్పడిందంటూ ఓ యువకుడు ఆమెపై పోలిస్టేషన్ లో పిర్యాదు చేశాడు. 

సినిమా నటి కరాటే కల్యాణి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమెతో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల అందించి వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది.  అయితే అదే టైమ్ లో వెంగళరావునగర్‌లో ఉంటున్న  కర్నూల్‌కు చెందిన నితేష్‌ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు.

అలా అడిగినందకు కరాటే కళ్యాణి అతనిపై దాడికి దిగింది. నన్ను అడగడానికి  నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని  అతను తెలిపాడు. 

అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్‌ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణిపై ఇప్పటికే  ఒక కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ శ్రీకాంత్ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి అతన్ని కొట్టింది నటి. అందరిముందు అవమానించింది. ఫ్రాంక్ వీడియోలంటూ.. మహిళలను అవమానించాడంటూ దాడికి పాల్పడింది.  ఈ విషయంలో శ్రీకాంత్ ఆమెపై కంప్లైయింట్ ఇచ్చాడు. శ్రీకాంత్ పై కూడా కళ్యాణి తిరిగి కంప్లైయింట్ ఇచ్చింది. 

అర్ధరాత్రి శ్రీకాంత్ ఇంటికి వెళ్ళడంతో పాటు.. అతన్ని డబ్బులు కూడా డిమాండ్ చేసిందన్న ఆరోపణ కళ్యాణిపై ఉంది.  ఫ్రాంక్‌ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. లక్ష ఇస్తే వెళ్లిపోతామంటూ...  ఆఫర్ చేయడం.. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి  70 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా అందుకు  శ్రీకాంత్ నిరాకరించడంతో... కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనను ప్రశ్నించడానికి వెళ్లినందుకు శ్రీకాంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

PREV
click me!

Recommended Stories

Ramayana Viral Photo: రణ్‌బీర్-సాయి పల్లవి ఫొటో నిజమా, ఫేకా? ‘రామాయణ’ ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందంటే..
Carmeni Selvam Movie: కార్‌ డ్రైవర్‌ కష్టాలు చెప్పబోతున్న సముద్రఖని.. ఆడియెన్స్ ముందుకు వచ్చేది ఇప్పుడే