తన లవర్ ని క్షమాపణలు అడిగిన సుశాంత్ సింగ్ ఎక్స్ లవర్

Published : Nov 03, 2020, 05:20 PM IST
తన లవర్ ని క్షమాపణలు అడిగిన సుశాంత్ సింగ్ ఎక్స్ లవర్

సారాంశం

సుశాంత్ మరణం వలన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సుశాంత్ మరణానికి ఆయన మాజీ లవర్ అంకితా లోఖండే కూడా కారణం అని కొందరు భావించారు. దీని వలన అంకితా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ విక్కీ జైన్ వేధింపులకు గురయ్యాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి దాదాపు ఐదు నెలలు కావస్తుంది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా సుశాంత్ మరణం సంచలనం రేపగా బాలీవుడ్ పెద్దలు సోషల్ మీడియా హేట్ కి గురయ్యారు. సుశాంత్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్కరిని అధికారులు విచారించారు. అలాగే కొందరు సోషల్ మీడియా వేధింపులు ఎదురయ్యాయి. 

సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. విడిపోయినప్పటికీ అంకితా నివసిస్తున్న ప్లాట్ కి సుశాంత్ ఈఎమ్ఐలు కడుతున్నారని వార్తలు రావడం జరిగింది.అలాగే అంకితా ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ విక్కీ జైన్ ని కూడా చాలా మంది దుర్భాషలు ఆడారట. అంకితా కారణంగా విక్కీ జైన్ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడని భావించిన అంకిత ఆయనకు సోషల్ ఇండియా ద్వారా క్షమాపణలు చెప్పింది. ఇంస్టాగ్రామ్ లో అంకిత ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

‘నీ పట్ల నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు చాలవు.నీ లాంటి మంచి వ్యక్తిని నా స్నేహితుడిగా, భాగస్వామిగా, సోల్‌మెట్‌గా పంపినందుకు, నా మనసులో ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను. అలానే నీవు నాకు అన్ని వేళలా అండగా ఉన్నావు. నా సమస్యలన్నింటిని నీవిగా భావించావు. నాకు అవసరమైన ప్రతిసారి సాయం చేశావు. నా సపోర్టు సిస్టంగా ఉన్నందుకు ధన్యవాదాలు. అన్నింటికి మించి నన్ను, నా సమస్యలని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు'' అని అంకితా పోస్ట్ పెట్టడం జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌