బ్యాడ్ టైమ్ లో సీతమ్మకు హారర్ ఛాన్స్ (3డి)!

Published : Nov 09, 2018, 08:57 PM IST
బ్యాడ్ టైమ్ లో సీతమ్మకు హారర్ ఛాన్స్ (3డి)!

సారాంశం

తెలుగమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావడమే ఎక్కువ అనుకుంటున్నా సమయంలో కోలీవుడ్ మంచి అవకాశాలు అందుకున్న బ్యూటీ అంజలి. అయితే ఈ మధ్య ఎందుకో అమ్మడి హవా తగ్గింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హోమ్లీ గర్ల్ స్టైలిష్ క్యారెక్టర్స్ కూడా చేసింది. 

తెలుగమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావడమే ఎక్కువ అనుకుంటున్నా సమయంలో కోలీవుడ్ మంచి అవకాశాలు అందుకున్న బ్యూటీ అంజలి. అయితే ఈ మధ్య ఎందుకో అమ్మడి హవా తగ్గింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతమ్మగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హోమ్లీ గర్ల్ స్టైలిష్ క్యారెక్టర్స్ కూడా చేసింది. 

తమిళ్ లో వరుసగా అవకాశాలు అందుకొని మొన్నటి వరకు కెరీర్ ను ఒక లెవెల్లో నడిపించింది. కానీ ఇప్పుడు అంజలికి అంతగా అవకాశాలు లేవు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు. ఇలాంటి సమయంలో అమ్మడు సీతమ్మకు ఒక హారర్ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది. లిసా అనే హారర్ మూవీ తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కనుంది. 

అది కూడా త్రీడీలో రూపొందుతున్న చిత్రం కావడంతో అంజలి సినిమాపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. అదే విధంగా తెలుగులో గీతాంజలి సీక్వెల్ చేస్తోంది అని వార్తలు వస్తున్నప్పటికీ ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో తెలియదు. మరి అంజలి ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి