మెగా పవర్ స్టార్ రాంచరణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతికి తమ చిత్రాల ద్వారా పోటీ పడుతున్నారు. రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 1న రిలీజ్ అవుతుండగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రం జనవరి 12న రిలీజ్ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతికి తమ చిత్రాల ద్వారా పోటీ పడుతున్నారు. రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 1న రిలీజ్ అవుతుండగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రం జనవరి 12న రిలీజ్ అవుతోంది. రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ బాబీ బాలయ్యతో డాకు మహారాజ్ తెరక్కించారు.
రాంచరణ్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ అంశాలు గేమ్ ఛేంజర్ లో ఉంటాయి. డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ ఈ విషయంలో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశారు. గ్రాండ్ విజువల్స్ తో ఉండే ఫైట్స్, పొలిటికల్ సన్నివేశాలు ఎంగేజ్ చేసేలా ఉంటాయని హింట్ ఇచ్చారు. డాకు మహారాజ్ చిత్రంలో కూడా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ప్రతి 10 నిమిషాలకు ఒకటి ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఫ్యాన్స్ సంతృప్తి చెందడానికి అవి చాలా కీలకం.
కానీ సినిమా నెక్స్ట్ లెవల్ కి చేరాలంటే కథ కూడా ఎంగేజింగ్ గా ఉండాలి. కథ మొత్తం హీరో పైనే ఆధారపడి ఉండదు అనేది వస్తావం. గేమ్ ఛేంజర్ చిత్రంలో సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలపై చిత్ర యూనిట్ భారీ అంచనాలతో ఉంది. సెకండ్ హాఫ్ లో రాంచరణ్ అప్పన్న పాత్రలో కనిపిస్తారు. అదే విధంగా అంజలి పాత్ర కూడా ఉంటుంది. అంజలి పాత్ర విషయంలో షాకింగ్ సర్ప్రైజ్ ఉందని శంకర్ హింట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ కనుక ఆకట్టుకుంటే గేమ్ ఛేంజర్ చిత్రానికి తిరుగులేదట. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.. సెకండ్ హీరోయిన్ గా అంజలి కీలకం కానుంది.
డాకు మహారాజ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది. శ్రద్దా శ్రీనాథ్ పాత్ర కూడా చాలా కీలకం కానుందట. చిన్న పాపకి సంబంధించిన సెంటిమెంట్ తో కథ ఉంటుందని డైరెక్టర్ బాబీ తెలిపారు. ఆ పాపకి, శ్రద్దా శ్రీనాథ్ కి కథలో ముఖ్యమైన లింక్ ఉందట. కథని మలుపు తిప్పే పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది.
సో.. గేమ్ ఛేంజర్ లో అయినా.. డాకు మహారాజ్ లో అయినా సెకండ్ హీరోయిన్లు అత్యంత కీలకం కానున్నారు. అంజలి, శ్రద్దా శ్రీనాథ్ పై పరోక్షంగా వందల కోట్ల బిజినెస్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. దీనితో వీళ్లిద్దరి పాత్రలపై రాంచరణ్, బాలయ్య ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీ సినిమా ఈవెంట్ జరగలేదు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహిస్తుండడం.. పైగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండడంతో ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి లేదా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై దిల్ రాజు ఆల్రెడీ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అదే విధంగా డాకు మహారాజ్ చిత్ర ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 4న అమెరికాలో డాకు మహారాజ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. నాగవంశీ ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారు. రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలు భారీ స్పాన్ ఉన్న మాస్ చిత్రాలు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం క్లాస్ మూవీ గా రిలీజ్ అవుతోంది. మాస్ చిత్రాలు విడుదలవుతున్నా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ వెనకడుగు వేయడం లేదు. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.