షాకిస్తున్న యాంకర్‌ సుమ కుమారుడి లేటెస్ట్ లుక్‌.. నెట్టింట ఫోటోలు చక్కర్లు

Published : Mar 16, 2022, 12:19 PM IST
షాకిస్తున్న యాంకర్‌ సుమ కుమారుడి లేటెస్ట్ లుక్‌.. నెట్టింట ఫోటోలు చక్కర్లు

సారాంశం

తాజాగా రోషన్‌ లుక్‌ షాకిస్తుంది. భారీ పర్సనాలిటీతో కనిపిస్తున్నారు. మంగళవారం(మార్చి15)న రోషన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా,మదర్‌, యాంకర్‌సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోషన్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. 

సుమ కనకాల(Suma Kanakala) యాంకర్‌గా తెలుగు సినిమా పరిశ్రమని ఓ ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. మొదట్లో నటిగా రాణించిన ఆమె ఆ తర్వాత పూర్తిగా యాంకరింగ్‌ పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ నటిగా తానేంటో నిరూపించుకుంటోంది. మరోవైపు తన వారసులను పరిచయం చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌లోకి వారసుల సందడి సాగుతోంది. ఇటీవల శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఎంట్రీ ఇచ్చారు. రోషన్‌తోనే `నిర్మల కాన్వెంట్‌` చిత్రంతో యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత గ్యాప్‌ తీసుకున్న రోషన్‌ హైయ్యర్‌ స్టడీస్‌ కోసం యూఎస్‌ వెళ్లాడు. 

ఇప్పుడు మళ్లీ సినిమా కెరీర్‌పై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. యాంకర్‌ సుమ(Anchor Suma), భర్త, నటుడు రాజీవ్‌ కనకాల సైతం ఈ విషయంలో సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. తనయుడి కోసం ఏకంగా ప్రొడక్షన్‌ స్టార్ట్ చేశారు సుమ. ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్‌ చేశారు. గతేడాది ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే తాజాగా రోషన్‌ లుక్‌ షాకిస్తుంది. భారీ పర్సనాలిటీతో కనిపిస్తున్నారు. మంగళవారం(మార్చి15)న రోషన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా,మదర్‌, యాంకర్‌సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోషన్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. కుమారుడు రోషన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, పంచుకున్న ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే `నిర్మల కాన్వెంట్‌` చిత్రం సమయంలో చిన్నగా ఉన్న రోషన్‌ ఇప్పుడు ఒకేసారి గుర్తుపట్టేనంతగా మారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అప్పుడే ఇంత పెద్దోడైపోయాడా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

అంతేకాదు సుమ అక్కలా, రోషన్‌ తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు చేయడం విశేషం. రోషన్‌ కటౌట్‌ మాత్రం ప్రభాస్‌ మాదిరిగా భారీగా ఉండటం మరో విశేషం. ఇక యాంకర్‌ సుమ ఓ వైపు టీవీ షోస్‌తో బిజీగా ఉంది. `స్టార్ట్ మ్యూజిక్‌`, `క్యాష్‌` వంటి ప్రోగ్రామ్‌లు చేస్తుంది. మరోవైపు సినిమాల ఈవెంట్లతోనూ బిజీగా ఉంది. దీంతోపాటు నటిగా రీఎంట్రీ ఇస్తూ `జయమ్మ పంచాయితీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెనే మెయిన్‌ లీడ్‌ కావడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?