Radhe Shyam :‘రాధేశ్యామ్’ 5 రోజులు కలెక్షన్స్ ,బ్రేక్ ఈవెన్ వస్తుందా?

Surya Prakash   | Asianet News
Published : Mar 16, 2022, 12:02 PM IST
Radhe Shyam :‘రాధేశ్యామ్’ 5 రోజులు కలెక్షన్స్ ,బ్రేక్ ఈవెన్ వస్తుందా?

సారాంశం

 రాధే శ్యామ్ కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుండి తెలిసింది. ఇందులో డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ నుంచే దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి తిరిగి వచ్చిందని అంటున్నారు.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక పోస్ట్ ఫోన్స్  తర్వాత ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం ప్రభాస్ ఇమేజ్ కారణంగా మొదటి మూడు రోజులు బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఐదు రోజులుకు ఎంత కలెక్ట్ చేసింది..బ్రేక్ ఈవెన్ కు రావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం.

డే 1 - 25.49 కోట్లు

డే 2 - 12.32 కోట్లు

డే 3 - 10.58  కోట్లు

డే 4 - 02.11  కోట్లు

డే 5 - 01.14  కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల  5 రోజుల షేర్   - 51.64 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల  5 రోజుల గ్రాస్ - 80.45  కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా   5 రోజుల షేర్ -  77.20 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల గ్రాస్ - 138.00  కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ - 204. కోట్లు


 రాధే శ్యామ్ కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుండి తెలిసింది. ఇందులో డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ నుంచే దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి తిరిగి వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందట. ఇక మిగిలింది థియేట్రికల్ కలెక్షన్స్ నుండి రాబట్టాలి. కాగా ఇప్పటికే మూడు రోజుల్లో ఆ మొత్తం వచ్చేసిందని చెప్తున్నారు.

ఇక ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికిస్పిరిట్  అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్, ఓమ్ రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?