యాంకర్ రవిపై ఏపీ ప్రజలు ఫైర్.. కారణమేంటంటే..?

Published : Jun 15, 2019, 12:06 PM IST
యాంకర్ రవిపై ఏపీ ప్రజలు ఫైర్.. కారణమేంటంటే..?

సారాంశం

ఏపీ ప్రజలు యాంకర్ రవిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతడు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. 

ఏపీ ప్రజలు యాంకర్ రవిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతడు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెలలో 'పటాస్' షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా మహిధర్ అనే కంటెస్టంట్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఆ సమయంలో రవి క్లాప్స్ కొడుతూ స్టేజ్ పైకి వెళ్లాడు. దీంతో అతడి వ్యవహారశైలి సదరు కంటెస్టంట్ ని సపోర్ట్ చేసినట్లుగా ఉండడంతో ఏపీ ప్రజలు రవిని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో రవి స్పందించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.

అందులో ఏపీ, తెలంగాణా వేర్వేరు కాదని.. రెండు రాష్ట్రాల ప్రజలు సమానమేనని చెప్పారు. గత నెలలో జరిగిన షోలో కంటెస్టంట్ మహిధర్ చేసింది తప్పేనని ఆ విషయాన్ని 'పటాస్' ఒప్పుకుంటుంది..నేను కూడా ఒప్పుకుంటున్నానని అన్నారు. 'మహిధర్' క్షమాపణలు కూడా చెప్పాడని.. ఆ సమయంలో నేను అతడిని సపోర్ట్ చేయలేదుని  యాంకర్ గా అక్కడ అలానే ప్రవర్తించాలని అన్నారు.

దయచేసి తనను ఈ వివాదంలోకి లాగకండని రిక్వెస్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని, నెల రోజుల్లో ఆయన్ని కలవబోతున్నట్లు చెప్పారు. అయితే వీడియోలో ఇంత మాట్లాడిన రవి క్షమాపణలు చెప్పకపోవడంతో మరోసారి అతడిపై విరుచుకుపడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు