బిగ్ బాస్ విన్నర్ అతడు కాకపోతే ధర్నాలే.. యాంకర్ రష్మి కామెంట్స్!

Published : Aug 23, 2018, 11:33 AM ISTUpdated : Sep 09, 2018, 11:08 AM IST
బిగ్ బాస్ విన్నర్ అతడు కాకపోతే ధర్నాలే.. యాంకర్ రష్మి కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ రియాలిటీ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే షో సాగుతోంది. గత రెండు రోజుల నుండి సాగుతున్న పెళ్లి టాస్క్ పక్కన పెట్టేస్తే మిగిలిన ఎపిసోడ్లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు

బిగ్ బాస్ రియాలిటీ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే షో సాగుతోంది. గత రెండు రోజుల నుండి సాగుతున్న పెళ్లి టాస్క్ పక్కన పెట్టేస్తే మిగిలిన ఎపిసోడ్లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇక హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ లకు ఎవరికీ లేనంత ఫాలోయింగ్ కౌశల్ కి జనాల్లో పెరిగిపోయింది. అతడి పేరు మీద సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది.

ఈ ఆర్మీ.. హౌస్ నుండి కౌశల్ ఎలిమినేట్  అవ్వకుండా చూడడం, కౌశల్ కి వ్యతిరేకంగా హౌస్ లో కామెంట్స్ చేసేవారిని ఎలిమినేట్ చేసే విషయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ షోపై యాంకర్ రష్మి స్పందించింది. బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు గెలుస్తారనే విషయాలపై కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మి.. ''బిగ్ బాస్ షో చూడను కానీ వింటుంటాను. అందులో చాలా మంది నాకు తెలిసినవాళ్లు ఉన్నారు.

నందిని రాయ్, కౌశల్, గీతాలతో నాకు మంచి రిలేషన్ ఉంది. అయితే ఈ షో ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండానే హౌస్ లో ఏం జరిగిందో.. వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. కౌశల్ ఆర్మీని ట్విట్టర్ లో చూస్తుంటాను. ఇప్పుడు చూసినంత వరకు షో మొత్తం వన్ సైడెడ్ గా అయిపొయింది. బిగ్ బాస్ టైటిల్ గెలిచేది కౌశల్ అనే అనిపిస్తుంది. కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్. వారు చాలా పోస్ట్ లు, వీడియోలు పెట్టడం చూస్తున్నాను. కౌశల్ గెలవకపోతే ధర్నాలు అయిపోతాయి'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?